ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Tirumala Laddu: తిరుమల లడ్డూ కల్తీపై మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు..

ABN, Publish Date - Sep 21 , 2024 | 06:09 PM

ఇప్పటికే చాలా మంది ప్రముఖలు ఈ వివాదంపై తీవ్రంగా స్పందించారు. శ్రీవారి భక్తులు, హిందూ సంఘాలు సైతం ఈ వివాదంపై కన్నెర్ర జేస్తున్నాయి. దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. నెయ్యి కల్తీ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి..

Mohan Babu

హైదరాబాద్, సెప్టెంబర్ 21: తిరుమల లడ్డూ ప్రసాదం తయారీకి జంతువుల కొవ్వు కలిసిన కల్తీ నెయ్యిని వినియోగిండంపై ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు కన్నెర్ర జేస్తున్నారు. తాజాగా టాలీవుడ్ సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు స్పందించారు. అంశంపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌ వేదికగా స్పందించిన మోహన్ బాబు.. ఇంతటి అపచారానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తిరుమల క్షేత్రంలో మహాపచారం జరిగిందని.. విషయం తెలిసి శ్రీవారి భక్తుడినైన తాను చింతించానని అన్నారు.


మోహన్ బాబు పోస్ట్ సారాంశం..

‘ప్రపంచ వ్యాప్తంగా ప్రతి హిందువు పూజించే కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి. ఆ దైవానికి నిత్యం సమర్పించే లడ్డూలలో కలిపే ఆవు నెయ్యిలో దాదాపు 3 నెలల క్రితం వరకు ఇతర జంతువుల కొవ్వుని కలుపుతున్నారని తెలియగానే ఒక భక్తుడిగా తల్లడిల్లిపోయాను. తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. నిత్యం మా మోహన్ బాబు విశ్వవిద్యాలయం నుంచి కనిపించే తిరుమల క్షేత్రాన్ని చూసి నాతోపాటు వేలాదిమంది ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు, నిత్యం భక్తిపూర్వకంగా నమస్కరించుకుంటూ ఉంటాం. ఆ స్వామి దగ్గర ఇలా జరగడం ఘోరం, పాపం, ఘోరాతి ఘోరం, నికృష్టం, అతినీచం, హేయం, అరాచకం. ఇదేగాని నిజమైతే నేరస్థులను శిక్షించాలని నా ఆత్మీయుడు, నా మిత్రుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడుని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఈ కలియుగ దైవం వేంకటేశ్వర స్వామి ఆశీస్సులు నా మిత్రుడు అందుకుని నూరేళ్ళు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను.’ అని మంచు మోహన్ బాబు ఎక్స్‌లో పోస్ట్ చేశారు.


మంచు మోహన్ బాబు చేసిన ఎక్స్ పోస్ట్ ఇదే..


ఇప్పటికే చాలా మంది ప్రముఖలు ఈ వివాదంపై తీవ్రంగా స్పందించారు. శ్రీవారి భక్తులు, హిందూ సంఘాలు సైతం ఈ వివాదంపై కన్నెర్ర జేస్తున్నాయి. దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. నెయ్యి కల్తీ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Updated Date - Sep 21 , 2024 | 06:09 PM