ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Minister Kolusu Parthasarathi : పెరిగిన ప్రతి పైసాకూ జగన్‌ దిక్కుమాలిన పాలనే కారణం

ABN, Publish Date - Dec 29 , 2024 | 06:28 AM

‘విద్యుత్‌ చార్జీల భారం ప్రజలపై పడకుండా ఆ మొత్తం డబ్బులు కూటమి ప్రభుత్వం భరించాలని వైసీపీ నేతలు ఉచిత సలహాలు ఇస్తున్నారు.

  • ఆయన కుంభకోణాలకూ ప్రజలే మూల్యం చెల్లిస్తున్నారు

  • వైసీపీ ప్రభుత్వమే అప్పుడు డబ్బులు చెల్తిస్తే అసలు చార్జీలు ఎందుకు పెరిగేవి?: మంత్రి పార్థసారథి

అమరావతి, డిసెంబరు 28(ఆంధ్రజ్యోతి): ‘విద్యుత్‌ చార్జీల భారం ప్రజలపై పడకుండా ఆ మొత్తం డబ్బులు కూటమి ప్రభుత్వం భరించాలని వైసీపీ నేతలు ఉచిత సలహాలు ఇస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో వేసిన మోత ఇప్పుడు ప్రజలపై పడుతోంది. వైసీపీ ప్రభుత్వమే అప్పుడు డబ్బులు ఇచ్చి ఉంటే అసలు చార్జీలు ఎందుకు పెరిగేవి? దీనికి వైసీపీ నేతలు సమాధానం చెప్పాలి’ అని మంత్రి కొలుసు పార్థసారథి డిమాండ్‌ చేశారు. శనివారం ఆయన ఇక్కడ టీడీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ‘విద్యుత్‌ సంస్థలకు వైసీపీ ప్రభుత్వం ఇవ్వాల్సిన డబ్బులు ఎగ్గొట్టింది. అవి గత్యంతరం లేక చార్జీలు పెంచాయి. ఆ విషయాన్ని కప్పిపెట్టి వైసీపీ నేతలు రోడ్ల మీద ధర్నాలు చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం మిగులు విద్యుత్‌తో రాష్ట్రాన్ని అప్పగించి వెళ్తే జగన్‌ తన ఐదేళ్ల పాలనలో ఆ రంగాన్ని కుప్పకూల్చాడు. జగన్‌ చేసిన కుంభకోణాలకూ ప్రజలు మూల్యం చెల్లించాల్సి వస్తోంది. హైదరాబాద్‌లో అత్యంత విలువైన పది ఎకరాల భూములను హిందూజా సంస్థ నుంచి జగన్‌ బినామీలు దక్కించుకొన్నారు. దానికి ప్రతిఫలంగా ఈ రాష్ట్రంలో ఆ కంపెనీకి అప్పనంగా రూ.1,450 కోట్లు విద్యుత్‌ సంస్థల నుంచి చెల్లించారు. ఆ ఖర్చు ఇప్పుడు జనం నెత్తిన పడింది. దొంగే దొంగ అని అరిచినట్లుగా వైసీపీ వైఖరి ఉంది. జగన్‌ అంత బాగా పాలన చేస్తే ఐదేళ్లలో పదిసార్లు చార్జీలు ఎందుకు పెంచాడు? ఆ పెంపు వల్ల ప్రజలపై రూ.32 వేల కోట్ల భారం పడింది.


అధికారంలోకి వచ్చీ రాగానే టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన పీపీఏలను చట్ట విరుద్ధంగా రద్దు చేశాడు. కోర్టు దానిని కొట్టివేసింది. దానివల్ల ఆ సంస్థల నుంచి తీసుకోవాల్సిన 7,000 మెగావాట్ల కరెంటు రాలేదు. ఆ కరెంటును విపరీతమైన రేట్లకు బయటకొని ప్రజలకు ఇవ్వాల్సి వచ్చింది. కోర్టు తీర్పు వల్ల పీపీఏలు రద్దు చేసిన కంపెనీలకు డబ్బు చెల్లించాల్సి వచ్చింది. ఒకే కరెంటుకు ఇద్దరికీ డబ్బులు చెల్లించారు. అది జగన్‌ జేబులో నుంచి ఇవ్వలేదు. కరెంటు చార్జీలు పెంచి జనం నుంచి వసూలు చేశారు. దీనికి వైసీపీ ఏం సమాధానం చెబుతుంది? విద్యుత్‌ సంస్థల నుంచి రూ.40 వేల కోట్ల అప్పులు తెచ్చి వాటిని ఇతరత్రా అవసరాలకు వాడారు. ఆ అప్పులు తీర్చడానికి విద్యుత్‌ సంస్థలు చార్జీలు పెంచి జనం నుంచి వసూళ్లు మొదలు పెట్టాయి. పెరిగిన ప్రతి పైసా చార్జీకి జగన్‌ దిక్కుమాలిన పాలనే కారణం. ఆయన ఐదేళ్ల పాలన వల్ల విద్యుత్‌ రంగంపై పడిన అదనపు భారం రూ.1.30 లక్షల కోట్లు’ అని మంత్రి పార్థసారథి ఆరోపించారు.

Updated Date - Dec 29 , 2024 | 06:28 AM