ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP News: లెక్కలన్నీ తీస్తా.. మంత్రి లోకేష్ మాస్ వార్నింగ్..

ABN, Publish Date - Aug 29 , 2024 | 08:22 PM

గత ప్రభుత్వ హయాంలో జరిగిన కుంభకోణాల లెక్కలన్నీ బయటపెడతామని మంత్రి నారా లోకేష్ అన్నారు. అక్రమాలకు బాధ్యులైన అందరిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. గురువారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన మంత్రి లోకేష్..

AP Minister Lokesh

అమరావతి, ఆగష్టు 29: గత ప్రభుత్వ హయాంలో జరిగిన కుంభకోణాల లెక్కలన్నీ బయటపెడతామని మంత్రి నారా లోకేష్ అన్నారు. అక్రమాలకు బాధ్యులైన అందరిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. గురువారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన మంత్రి లోకేష్.. రాష్ట్రంలో జరిగిన భూ కుంభకోణాలపై సిసోడియా నివేదికపై వచ్చే కేబినెట్ భేటీలో చర్చిస్తామన్నారు. లెక్కలన్నీ బయటపెడతామన్నారు. వైసీపీ పాలనలో విశాఖలో రాజారెడ్డి రాజ్యాంగం అమలైందని వ్యాఖ్యానించారు. బెదిరింపులకు పాల్పడి భూములను దోచేసుకున్నారని అన్నారు. ఆ క్రమంలో రాష్ట్రంలో అనేక నేరాలు జరిగాయని గత ప్రభుత్వంపై మంత్రి లోకేష్ తీవ్ర ఆరోపణలు చేశారు.


విశాఖపట్నా్న్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు కేంద్రంగా మారుస్తామని మంత్రి లోకేష్ చెప్పారు. ఆ దిశగా పెట్టుబడిదారులతో చర్చిస్తున్నామని తెలిపారు. ఎన్డీయే కూటమికి ప్రజాక్షేత్రంలో మంచి తీర్పు వచ్చిందన్నారు. ఇక కోర్టులో తీర్పు పెండింగ్‌లో వుందన్నారు. తనపై ఓ పత్రిక తప్పుడు కథనాలు ప్రచురించిందన్న మంత్రి లోకేష్. ఆ పత్రికపై రూ. 75 కోట్లకు పరువు నష్టం దావా వేశానన్నారు.


రాష్ట్రంలో ఫీజు రీఎంబర్స్‌మెంట్‌లో పాత విధానాన్నే అమలు చేస్తామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. సెప్టెంబర్ 11న ముఖ్యమంత్రి సమక్షంలో ఫీజ్ రీఎంబర్స్‌మెంట్ అమలు మీద నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అధికారం టీడీపీకి కొత్తేమీ కాదన్నారు. తాను ఎప్పుడు మంత్రిగా ఉన్నా ఖర్చులన్నీ తన సొంత డబ్బుతోనే పెడతానని లోకేష్ చెప్పారు. ప్రభుత్వం ఖర్చుతో కప్పు కాఫీ కూడా తాగలేదన్నారు. జగన్‌ రెడ్డిలా తనకు ప్రజాధనం లూటీ చేయడం రాదన్నారు. రుషికొండ, సర్వేరాళ్ల కోసం వందల కోట్లు దుర్వినియోగం చేశారని గత ప్రభుత్వం తీరును మంత్రి లోకేష్ విమర్శించారు. అది పట్టుదలనో.. సైకో ఫ్యాన్సీనో కానీ.. ఐదేళ్ల కాలంలో ఇలాగే వ్యవహరించారని దుయ్యబట్టారు.


రెడ్‌ బుక్‌ను ఖచ్చితంగా ఫాలో అవుతా..

రెడ్ బుక్‌ను ఖచ్చితంగా ఫాలో అవుతానని ముందే చెప్పానని పునరుద్ఘాటించారు మంత్రి లోకేష్. ఏ అధికారులు చట్టాన్ని ఉల్లంఘించారో వాళ్ళను వదిలి పెట్టనని మరోసారి స్పష్టం చేశారు. తప్పు చేయని వాళ్ళు ఎందుకు భయపడాలని అన్నారు. సినీనటికి వేధింపులు వ్యవహారం బయటకు వచ్చాయని.. ఎంత దుర్మార్గంగా వ్యవహరించారో ఆ నటి ఆవేదన చూస్తే అర్థం అవుతోందన్నారు. ఈ వ్యవహారంలో అధికారుల ప్రమేయం బయటకు వస్తుందన్నారు. వాటన్నింటి మీద విచారణ జరగాలన్నారు.


గత ప్రభుత్వ నిర్వాకం వల్ల తగ్గిన విద్యార్థుల సంఖ్య..

గత ప్రభుత్వ విధానాల వల్ల స్కూలుకు వెళ్లే విద్యార్థుల సంఖ్య 35 లక్షలకు పడిపోయిందన్నారు మంత్రి లోకేష్. గత ప్రభుత్వం విద్యావ్యవస్థలో తీసుకున్న నిర్ణయాలను సమీక్షిస్తున్నామని చెప్పారు. నాడు నేడు స్కీం.. మనబడి - మన భవిష్యత్ పేరుతో కొనసాగుతుందని మంత్రి ప్రకటించారు. CBSE కోర్సు, ఎగ్జామినేషన్ టఫ్ గా వుంటుందని.. విద్యార్థులు సరైన ప్రిపరేషన్ కూడా లేకుండా పరీక్షలకు వెళ్లారన్నారు. అందుకే నెగటివ్ ఫలితాలు వస్తున్నాయి. విద్యావ్యవస్థలో సంస్కరణలు అవసరం అని మంత్రి అభిప్రాయపడ్డారు. వాటిని అమలు చేయడం కోసం ఉపాధ్యాయ సంఘాలు, మెథావులు అభిప్రాయాలను తీసుకుంటున్నామని లోకేష్ చెప్పారు. రాష్ట్రంలో ఉన్న పరిశ్రమల విస్తరణ, కొత్త పెట్టుబడుల కోసం పారిశ్రామిక వెత్తలతో మాట్లాడుతున్నామని తెలిపారు.


Also Read:

హైడ్రా సంచలన నిర్ణయం! రంగం సిద్ధం!

హైడ్రాకు మద్దతు.. రూ.25 లక్షల నిధులు ఇచ్చిన ఎంపీ

సీఎం రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్ట్ షాక్

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Aug 29 , 2024 | 08:22 PM

Advertising
Advertising