ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Minister N Manohar : ఆ బియ్యం విలువ 2.23 కోట్లు

ABN, Publish Date - Dec 18 , 2024 | 04:11 AM

మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నానికి సంబందించిన గోదాముల్లో మాయమైన బియ్యం విలువ రూ.1.7 కోట్లు కాదని, రూ.2.23 కోట్లకు..

  • పేర్ని నాని గోదాముల్లో మాయమైనబియ్యంపై మంత్రి స్పష్టత

  • రెండో గోదాములో తనిఖీల తర్వాత విలువ పెరిగే అవకాశం

  • ఇకపై బియ్యం స్మగ్లింగ్‌ చేస్తే పీడీ యాక్ట్‌: మంత్రి మనోహర్‌

  • మచిలీపట్నం మార్కెట్‌ యార్డుకు 4,093 బస్తాలు తరలింపు

తెనాలి/విజయవాడ/మచిలీపట్నం, డిసెంబరు 17(ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నానికి సంబందించిన గోదాముల్లో మాయమైన బియ్యం విలువ రూ.1.7 కోట్లు కాదని, రూ.2.23 కోట్లకు పైగా ఉందని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా తెనాలిలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పేర్ని కుటుంబం గోదాముల తనిఖీకి సహకరించకపోవడం వల్లే ఒకేసారి కచ్చిత అంచనాకు రాలేకపోయామని, మరికొన్ని రోజుల్లో ఎంతమేర బియ్యం మాయం చేశారనేది తేలుస్తామని స్పష్టం చేశారు. నాని గోదాముల్లో దాడులు రాజకీయ కక్షలో భాగమేనని చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. ఏ దురుద్దేశం లేకపోతే పేదల బియ్యం నిల్వ కోసం తన సొంత గోదాములను ఆయన ఎందుకు అద్దెకిచ్చారని నిలదీశారు. ఏ తప్పూ చేయకపోతే నోటీసిచ్చిన రోజే రూ.కోటి డీడీ ఎందుకు కట్టారని ప్రశ్నించారు. మచిలీపట్నంలోని వేబ్రిడ్జిలో సాంకేతిక సమస్యతో పొరపాటు వచ్చిందని, సుమారు 3వేల బస్తాల బియ్యం తక్కువగా ఉన్నాయని, దానికి సంబంధించి ప్రభుత్వం నిర్ణయించిన మొత్తం చెల్లించడానికి సిద్ధంగా ఉన్నామంటూ కృష్ణాజిల్లా జాయింట్‌ కలెక్టర్‌ పేరుతో నాని భార్య జయసుధ లేఖ రాశారని వివరించారు. స్టాక్‌ రిజిస్టర్ల ఆధారంగా 185 టన్నుల బియ్యం తగ్గిందని అంచనాకు వచ్చి సివిల్‌ సప్లైస్‌ ఎండీ వెంటనే డబుల్‌ అమౌంట్‌ కింద రూ.1,70,56,000 జరిమానా వసూలు చెయ్యాలని, ఆ గోదాముల యజమానులపై క్రిమినల్‌ కేసులు పెట్టాలని నిర్ణయించారని తెలిపారు. గోదాముల్లో నిల్వలు లెక్కించేందుకు ఒక కమిటీ వేసి, ఈ నెల 16న తనిఖీకి వస్తున్నామని, 13న నోటీసిస్తే, అదే తేదీన వారి న్యాయవాది ద్వారా రూ.కోటి విలువైన డీడీలు ఇచ్చారని తెలిపారు.


16న తనిఖీకి వెళితే గోదాము తాళాలు కూడా తీయలేదని మంత్రి ఆరోపించారు. రికార్డులు సీజ్‌చేసి, అక్కడ ఉన్న 4,093 బస్తాల బియ్యాన్ని తరలించామని చెప్పారు. అయితే వారు చెప్పినట్టు 3వేల బస్తాల బియ్యం కాదని, 4,840 (243 టన్నులు) బస్తాలు మాయమైనట్టు తేలిందని చెప్పారు. దీనిపై రూ.2,23,56,000 జరిమానా వసూలు చేస్తామని తెలిపారు. రెండో గోదామును కూడా తనిఖీ చేయాలని భావిస్తున్నామని అన్నారు. డీడీలిచ్చేస్తే సరిపోదని, వారిపై క్రిమినల్‌ చర్యలు ఉంటాయని మంత్రి స్పష్టం చేశారు. పేదల బియ్యాన్ని పక్కదారి పట్టించాలని చూస్తే పీడీ చట్టం కింద చర్యలు ఉంటాయని, ఈ మేరకు చట్ట సవరణ చేస్తామని మనోహర్‌ స్పష్టం చేశారు. కాగా, పేర్ని నానికి చెందిన గోదాములను అధికారులు మంగళవారం ఖాళీ చేశారు. గోదాముల నుంచి 4,093 బస్తాల పీడీఎస్‌ బియ్యాన్ని మచిలీపట్నం మార్కెట్‌ యార్డులోని ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌కు తరలించినట్టు పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్‌ పద్మాదేవి తెలిపారు. ప్రతి బ్యాగు 50.300 కిలోలు చొప్పున ఉండాలని, అయితే కొన్ని 47 కిలోలు, ఇంకొన్ని 48 కిలోలు మాత్రమే ఉన్నాయని చెప్పారు.

లుక్‌అవుట్‌ నోటీస్‌ సమాచారం లీక్‌

పేర్ని నానికి చెందిన గోదాములు ఆయన భార్య పేర్ని జయసుధ పేరున ఉన్నాయి. వాటి నుంచి బియ్యం మాయమైన కేసులో జయసుధతోపాటు, గోడౌన్‌ మేనేజర్‌ మానస్‌ తేజపై మచిలీపట్నం తాలూకా పోలీసులు కేసు నమోదుచేశారు. నిందితులను అరెస్ట్‌ చేయడానికి సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ ట్రాక్‌ చేయడం ప్రారంభించారు. ఈ సమాచారాన్ని కొందరు పోలీసు అధికారులు పేర్ని నానికి చేరవేశారు. దీంతో అప్రమత్తమైన ఆయన తన సతీమణిని సురక్షిత ప్రదేశానికి పంపేసినట్లు సమాచారం.

స్వాహా చేసింది 243 టన్నులు..!

పేర్ని నాని గోదాముల నుంచి సుమారు 250 టన్నుల పీడీఎస్‌ బియ్యం మాయమైందని ‘ఆంధ్రజ్యోతి’ ముందుగా వెలుగులోకి తీసుకొచ్చింది. ఆ తర్వాత పౌరసరఫరాల శాఖ అధికారులు 187 టన్నులని, 180 టన్నులని పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు. మంత్రి మనోహర్‌ కూడా పేర్ని గోదాముల నుంచి పక్కదారి పట్టిన బియ్యం 243 టన్నులని, వాటి విలువ రూ.2.23 కోట్లు ఉంటుందని చెప్పారు.

Updated Date - Dec 18 , 2024 | 04:11 AM