MLA Vasantha: మైలవరంలో టీడీపీ జెండా ఎగురవేస్తా
ABN, Publish Date - Mar 22 , 2024 | 06:36 PM
చంద్రబాబు నాయుడు, లోకేష్ కల్పించిన ఈ అవకాశం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు. మైలవరంలో టీడీపీ నాయకులను, కార్యకర్తలను, అందరిని కలుపుకొని ముందుకు వెళ్తానని అన్నారు. గత 15 ఏళ్లుగా మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఇన్‌చార్జిగా ఉండటంతో అక్కడున్న వారిని అందరిని కలుపుకొని ముందుకెళ్తానని చెప్పారు. తనకు ఎవరితో వ్యక్తిగత వివాదాలు లేవని అన్నారు.
మైలవరం: టీడీపీ (TDP) మూడో జాబితా ఈరోజు(శుక్రవారం) విడుదలైన విషయం తెలిసిందే. 11 శాసనసభ స్థానాలతో పాటు 13 ఎంపీ అభ్యర్థులను టీడీపీ (TDP) ప్రకటించింది. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నుంచి ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ (MLA Vasantha Krishna Prasad) టికెట్ దక్కించుకున్నారు. ఇటీవలే ఆయన వైఎస్సార్‌సీపీ (YSRCP) నుంచి టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. ఇక టీడీపీ మైలవరం టికెట్ దక్కించుకున్న సందర్భంగా పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడి (Chandrababu)కి ధన్యవాదాలు తెలిపారు.
Gorantla: గుడ్డలూడదీస్తా... ఖబడ్దార్.. మార్గాని భరత్‌కు గోరంట్ల హెచ్చరిక
ఆయన మీడియాతో మాట్లాడుతూ... చంద్రబాబు నాయుడు, లోకేష్ కల్పించిన ఈ అవకాశం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు. మైలవరంలో టీడీపీ నాయకులను, కార్యకర్తలను, అందరిని కలుపుకొని ముందుకు వెళ్తానని అన్నారు. గత 15 ఏళ్లుగా మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఇన్‌చార్జిగా ఉండటంతో అక్కడున్న వారిని అందరిని కలుపుకొని ముందుకెళ్తానని చెప్పారు. తనకు ఎవరితో వ్యక్తిగత వివాదాలు లేవని అన్నారు. వచ్చే ఎన్నికల్లో మైలవరంలో టీడీపీ జెండా ఎగరవేస్తానని ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వస్తుందని వసంత కృష్ణ ప్రసాద్ ఆశాభావం వ్యక్తం చేశారు.
Chandrababu: అందుకే ఎన్డీయేలో చేరాం...
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated Date - Mar 22 , 2024 | 10:19 PM