MLA Vasantha Krishna Prasad: మైలవరంలో టీడీపీ జెండా ఎగురవేస్తా..
ABN, Publish Date - Mar 22 , 2024 | 12:09 PM
టీడీపీ మూడో జాబితా ఇవాళ విడుదలైన విషయం తెలిసిందే. 11 శాసనసభ స్థానాలతో పాటు 13 ఎంపీ అభ్యర్థులను టీడీపీ ప్రకటించింది. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నుంచి ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ టికెట్ దక్కించుకున్నారు. ఇటీవలే ఆయన వైసీపీ నుంచి టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. ఇక టీడీపీ మైలవరం టికెట్ దక్కించుకున్నసందర్భంగా ఆయన సోషల్ మీడియా వేదికగా పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు తెలిపారు.
విజయవాడ: టీడీపీ (TDP) మూడో జాబితా ఇవాళ విడుదలైన విషయం తెలిసిందే. 11 శాసనసభ స్థానాలతో పాటు 13 ఎంపీ అభ్యర్థులను టీడీపీ (TDP) ప్రకటించింది. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నుంచి ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ (MLA Vasantha Krishna Prasad) టికెట్ దక్కించుకున్నారు. ఇటీవలే ఆయన వైఎస్సార్‌సీపీ (YSRCP) నుంచి టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. ఇక టీడీపీ మైలవరం టికెట్ దక్కించుకున్నసందర్భంగా ఆయన సోషల్ మీడియా వేదికగా పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడి (Chandrababu)కి ధన్యవాదాలు తెలిపారు. ‘‘నాపై నమ్మకం ఉంచి మైలవరం నియోజకవర్గ అసెంబ్లీ సీటు కేటాయించిన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు. మైలవరం నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఎగిరెలా నియోజకవర్గంలోని ప్రతిఒక్క నాయకుడిని, కార్యకర్తలను సమన్వయపరుస్తూ నా ప్రయాణం కొనసాగిస్తా’’ అని వసంత కృష్ణ ప్రసాద్ ట్విటర్ (Twitter) వేదికగా చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు.
TDP Third List: టీడీపీ మూడో జాబితా విడుదల.. టికెట్ దక్కిన నేతలు వీరే..
వసంతకు టికెట్ కేటాయించడంపై మైలవరంలో టీడీపీ శ్రేణులు సంబరాల్లో మునిగి తేలుతున్నాయి. వసంత పేరు ప్రకటించడంతో మైలవరం ప్రధాన రహదారి పై, పార్టీ కార్యాలయం వద్ద నాయకులు బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. వసంత నాయకత్వం వర్ధిల్లాలని నినాదాలు చేశారు. అయితే ఇక్కడి టికెట్‌ను తొలుత మాజీ మంత్రి దేవినేని ఉమ (Devineni Uma)కు కేటాయిస్తారని అంతా భావించారు. వసంత టీడీపీలో చేరే సమయంలో కూడా మైలవరం టికెట్ ఎవరికి కేటాయించినా తాను సహకరిస్తానన్నారు. కానీ అనూహ్యంగా మైలవరం టికెట్ వసంతకే దక్కింది. కాగా.. పొత్తులో భాగంగా టీడీపీ 144 అసెంబ్లీ, 17 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేయనున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా ఇప్పటికే 128 శాసనసభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇవాళ కొత్తగా మరో11 శాసనసభ స్థానాలతో పాటు 13 ఎంపీ అభ్యర్థులను ప్రకటించింది. ఇక కేవలం 5 అసెంబ్లీ, 4 ఎంపీ స్థానాలను మాత్రమే పెండింగ్‌లో ఉంచింది.
AP Elections: ఎమ్మెల్యే ద్వారంపూడిని ఏకిపారేసిన జనం..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
Updated Date - Mar 22 , 2024 | 12:09 PM