Muppalla Subbarao: ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ రద్దు చేయించాలి
ABN, Publish Date - Jun 30 , 2024 | 05:24 AM
‘వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు మధ్యంతర బెయిల్ రద్దు చేయించాలి. దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యంను హత్య చేసి డోర్ డెలివరీ చేసిన అనంతబాబుపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలి’ అని ఏపీ బార్ కౌన్సిల్ సభ్యుడు, పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముప్పాళ్ల సుబ్బారావు అన్నారు.
సుబ్రహ్మణ్యం కుటుంబానికి వైసీపీ అన్యాయం: ముప్పాళ్ల సుబ్బారావు
రాజమహేంద్రవరం సిటీ, జూన్ 29: ‘వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు మధ్యంతర బెయిల్ రద్దు చేయించాలి. దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యంను హత్య చేసి డోర్ డెలివరీ చేసిన అనంతబాబుపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలి’ అని ఏపీ బార్ కౌన్సిల్ సభ్యుడు, పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముప్పాళ్ల సుబ్బారావు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేం ద్రవరంప్రె్‌సక్లబ్‌లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘అనంతబాబును కాపాడడానికి ఆ రోజు ఉన్న దిగువస్థాయి పోలీసు అధికారుల నుంచి ఉన్నత స్థాయి అధికారుల వరకు పనిచేశారు.
ఈ కేసులో అనంతబాబు, తన అనుచరులను జాగ్రత్తగా తప్పించాడు. అతని వెంట ఉండే గన్‌మెన్ కూడా కేసు విచారణలో లేడు. కాకినాడ పోలీసులు పూర్తిగా అనంతబాబుకు వత్తాసుపలికి ఆనాటి అధికార పార్టీ ఒత్తిడితో విచారణ సక్రమంగా చేయలేదు. ఈ కేసులో అనేక వాస్తవాలు బయటకు రావాల్సి ఉంది. హత్యలో పాల్గొన్న మిగిలిన వారిని అరెస్టు చేయాల్సి ఉంది’ అని వివరించారు. అనంతరం వీధి సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు నూకరాజు, సత్యనారాయణ మాట్లాడుతూ... సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌లు స్పందించి తమకునాయ్యం చేయాలని కోరారు.
Updated Date - Jun 30 , 2024 | 06:49 AM