Nara Bhuvaneshwari: సరదా సరదాగా.. విద్యార్థులతో మమేకమైన నారా భువనేశ్వరి
ABN, Publish Date - Dec 20 , 2024 | 11:24 AM
కాలేజీ రోజులను గుర్తు చేసుకున్నారు. నాటి సరదాలే కాదు.. చిన్న వయసులోనే పెళ్లయిన అమాయకత్వాన్ని, ఏమీ తెలియనితనంనుంచి భర్త చంద్రబాబు దన్నుతో హెరిటేజ్ సారథిగా సాధించిన విజయాలను తలపోశారు. అన్న బాలకృష్ణ డైలాగ్‌ను వల్లించారు.
కుప్పం: కాలేజీ రోజులను గుర్తు చేసుకున్నారు. నాటి సరదాలే కాదు.. చిన్న వయసులోనే పెళ్లయిన అమాయకత్వాన్ని, ఏమీ తెలియనితనంనుంచి భర్త చంద్రబాబు దన్నుతో హెరిటేజ్ సారథిగా సాధించిన విజయాలను తలపోశారు. అన్న బాలకృష్ణ(Balakrishna) డైలాగ్‌ను వల్లించారు. కుమారుడు లోకేశ్ బాల్యాన్ని, పెద్దయ్యాక ఆయనకు చేసిన ఉద్బోధను ఏకరువు పెట్టారు. మొత్తంమీద నారా భువనేశ్వరి చిత్తూరు జిల్లా కుప్పం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులతో మమేకమై వారిలో ఒకరిగా మారిపోయారు. విద్యార్థులతో ముఖాముఖి సందర్భంగా ఇచ్చిన సమాధానాలలో కాసేపు సరదాగా, కాసేపు సీరియ్‌సగా, ఇంకాసేపు గంభీరంగా ఆమె చాలా అంశాలు ప్రస్తావించారు.
ఈ వార్తను కూడా చదవండి: Guinness World Record: ఒకేసారి 555 మందికి వర్మ చికిత్స..
- మిమ్మల్ని చూస్తుంటే నాకు నా కాలేజ్ డేస్ గుర్తుకొస్తున్నాయి. నేనూ మీలాగే సరదాగా ఉండేదాన్ని. కానీ చదువుకుంటుండగానే నాకు చంద్రబాబుతో పెళ్లయిపోయింది. ఆ వయసులో నాకు ఏమీ తెలియదు. అయినా నామీద నమ్మకంతో నా భర్త చంద్రబాబు హెరిటేజ్ ఎండీని చేశారు. ఛాలెంజ్‌గా తీసుకుని పనిచేశా. ఇప్పుడీ స్థితికి చేరుకున్నా. ఎవరైనా సరే, కష్టపడనిదే విజయం ఊరికే రాదు.
- నా హీరో చంద్రబాబు. ఆయన విజనరీ నాకు ఆదర్శం. భార్యాభర్తల్లో ఎవరైనా ఎదగాలంటే ఎవరో ఒకరు త్యాగం చేయాలి తప్పనిసరిగా. ఆయన నాకిచ్చే సమయం ఉదయం 8.30 గంటలకు. తర్వాత ఆయన తన బాధ్యతల్లో మునిగిపోతారు. ఏదైనా అవసరమై ఫోన్ చేయాలన్నా, పీఏకి చేయాల్సిందే. ఆయన ఫోన్ ఎత్తరు.
- నేను లోకేశ్ విషయంలో చాలా స్ట్రిక్ట్. నన్ను హిట్లర్ అని పిలిచేవాడు. తన స్నేహితులకు కూడా అలాగే చెప్పేవాడు. చంద్రబాబు రాష్ట్రంకోసం, ప్రజలకోసం పనిచేస్తుంటే సింగిల్ మదర్‌గా పెంచానేమో, లోకేశ్‌ను చాలా క్రమశిక్షణలో పెట్టేదాన్ని.
- నాడు, నేడు రాజకీయాల్లో ఒక తేడా ప్రధానంగా కనిపిస్తోంది. ఒకప్పుడు లీడర్‌కు అనుచరులు పూర్తి విశ్వాసంగా ఉండేవారు . నేడు ఆ విశ్వాసం, బాధ్యత తగ్గిందనిపిస్తోంది. లోకేశ్ బాబు ప్రజలకు న్యాయం చేస్తాడు. నేను హామీ ఇస్తున్నా.
- నేను సినిమాలు చాలా తక్కువ చూస్తా. బాలయ్య మూవీలో ఏది నచ్చిందంటే చెప్పలేను. చూసినంతలో సమరసింహారెడ్డి నచ్చిందని చెప్పవచ్చు. డైలాగ్స్ నాకు రావు. అయినా వచ్చినంత చెబుతాను. ఒకేవైపు చూడు, మరోవైపు చూడబాక అనే డైలాగ్. ఏ విషయంలోనైనా ఫోక్‌స్డగా ఉండాలి. అప్పుడు విజయం వరిస్తుంది. అదే ఈ డైలాగ్‌లో చెప్పారేమో.
- నేను హైలెవల్ పర్ఫెక్షనిస్టుగా ఉండాలనుకుంటా. అంటే ఏ చిన్న లోపమూ కనిపించకూడదు. ఈ క్రమంలో చాలా అలసిపోతా. ధ్యానం నా స్ట్రెస్ బస్టర్. ఉదయం, సాయంత్రం మెడిటేషన్ చేస్తా. ఇంకా మనవడున్నాడు నాకు. వాడితో టైం స్పెండ్ చేస్తే కూడా ఒత్తిడి తగ్గిపోతుంది. వాడికి అయిదు సంవత్సరాలు వచ్చేవరకు నా మాట వినేవాడు. ఇప్పుడు నేను ఏం చెప్పినా వినడంలేదు. నాతో ఫైటింగ్ ఎక్కువ. ఎందుకొచ్చిన గొడవని వాడి మాట వినడం అలవాటు చేసుకున్నా.
- నాకు మ్యాథ్స్ ఇష్టం లేదు. హిస్టరీ ఇష్టం. చంద్రబాబు ఎకనామిక్స్ పీజీ చేశారు. ఆ సబ్జెక్టు కూడా ఇష్టం లేదు. చాలా డ్రై సబ్జెక్టు. ఆయన ఎలా మ్యానేజ్ చేశారో.
- నాకు మొదట్లో కుక్స్ లేరు. నేనే వంట చేసేదాన్ని, డ్రైవింగ్ కూడా నేనే. మా ఆయనకు డబ్బులు సేవ్ చేసేదాన్ని. ఇప్పటికి కూడా నేను 20-30 మందికి వంటచేసి వడ్డించగలను. అయితే లోకేశ్ చిన్నప్పుడు నామీద ఒకటే కంప్లయింట్ చేసేవాడు. ఎవరైనా అడిగితే మా అమ్మ ఏమీ చేయలేదు. ఒట్టి రసమన్నం పెడుతుంది అనేవాడు. నేను ఇల్లు ఊడుస్తుంటే బెడ్ కిందనుంచి బర్గర్ల బాక్స్‌లు బయటపడేవి. వాడికి బర్గర్లు, స్నాక్స్ అంటే అప్పట్లో చాలా ఇష్టం. ఫ్రెండ్స్‌తో తెప్పించుకునేవాడేమో. ఇప్పటికీ లోకేశ్‌తో ఆ విషయం గురించి చెప్పి, నవ్విస్తుంటా.
- నాకు బహుమతుల మీద ఆశలేదు. ఆయనను ఎప్పుడూ వాటిని గురించి అడగను. అయితే మా ఫ్రెండ్ హజ్బెండ్ ఒకరు మ్యారేజ్ యానివర్శరీకి ఆవిడకు డైమండ్ రింగ్ కొని ప్రజంట్ చేశారట. నాకు చెప్పింది. నేను కూడా మాయానివర్శరీకి డైమండ్ రింగ్ కొనమని అడిగాను. నువ్వే ఒక డైమండ్, నీకు ఇంకా వేరే డైమండ్ ఎందుకన్నారు. అలా చాకచక్యంగా తప్పించుకున్నారన్న మాట. అంతే, అప్పటినుంచి నేను ఆయననుంచి ఏ బహుమతులూ కోరలేదు.
ఈవార్తను కూడా చదవండి: ACB Case: కేటీఆర్ ఏ1
ఈవార్తను కూడా చదవండి: HYDRA: మణికొండలో హైడ్రా కూల్చివేతలు!
ఈవార్తను కూడా చదవండి: Jagityala: చిన్నారుల ప్రాణాలకు ‘పెద్ద’ ముప్పు!
ఈవార్తను కూడా చదవండి: కాళేశ్వరంపై విచారణ.. హాజరైన స్మితా సబర్వాల్, సోమేష్‌కుమార్..
Read Latest Telangana News and National News
Updated Date - Dec 20 , 2024 | 11:24 AM