ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Nuziveedu : ట్రిపుల్‌ ఐటీ విద్యార్థినికి లోకేశ్‌ అండ

ABN, Publish Date - Dec 24 , 2024 | 04:10 AM

బ్రెయిన్‌ స్ర్టోక్‌కు గురై ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న నూజివీడు ట్రిపుల్‌ ఐటీ విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్‌ అండగా నిలిచారు.

  • బ్రెయిన్‌ స్ర్టోక్‌ చికిత్సకు ఆర్థిక సాయం

  • మంత్రికి విద్యార్థుల ధన్యవాదాలు

అమరావతి, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): బ్రెయిన్‌ స్ర్టోక్‌కు గురై ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న నూజివీడు ట్రిపుల్‌ ఐటీ విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్‌ అండగా నిలిచారు. సకాలంలో స్పందించి ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడేందుకు సాయం చేశారు. శ్రీకాకుళానికి చెందిన మురపాల అనూష నూజివీడు ట్రిపుల్‌ ఐటీ క్యాంప్‌సలో ఇంజనీరింగ్‌ మొదటి సంవత్సరం చదువుతోంది. ఇటీవల ఆమెకు బ్రెయిన్‌ స్ర్టోక్‌ రావడంతో ఆస్పత్రికి తరలించారు. ఆమె ప్రాణాన్ని కాపాడేందుకు మెరుగైన వైద్యం కోసం సహాయం చేయాలని విద్యార్థులు ఎక్స్‌ ద్వారా మంత్రిని కోరారు. వెంటనే స్పందించిన లోకేశ్‌.. సొంత ఖర్చుతో మెరుగైన సాయం అందించేలా చర్యలు తీసుకున్నారు. దీంతో ఆ విద్యార్థిని ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడింది. ఈ సమస్యపై తక్షణం స్పందించిన మంత్రికి విద్యార్థులు ధన్యవాదాలు తెలిపారు. ట్రిపుల్‌ ఐటీ పూర్వ విద్యార్థిని పద్మజ ఎక్స్‌లో స్పందిస్తూ... గతంలోనూ నూజివీడు ట్రిపుల్‌ ఐటీ క్యాంప్‌సలో భోజనం సమస్య ఉందని చెప్పగానే మంత్రి స్పందించి పరిష్కరించారని తెలిపింది. ఇప్పుడు అదే క్యాంపస్‌ విద్యార్థినిని ప్రాణాపాయ స్థితిని నుంచి కాపాడారని వెల్లడించింది. ‘మీరు చేసే ప్రతి పని మాలో ధైర్యాన్ని, ఉత్సాహాన్ని నింపుతోంది. ఒక అన్నలా మాకు అండగా నిలుస్తున్నారు. అడిగిన వెంటనే సాయం చేస్తున్నారు. మీరు చేసిన సాయానికి జీవితాంతం రుణపడి ఉంటాం’ అని పేర్కొంది.


టీడీపీ కార్యకర్తకు భరోసా..

తీవ్ర అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న టీడీపీ కార్యకర్త, ఎన్టీఆర్‌ అభిమాని కే మల్లికార్జునరెడ్డికి మంత్రి నారా లోకేశ్‌ అండగా నిలిచారు. పార్టీ ఆవిర్భావం నుంచి కార్యకర్తగా ఉంటూ, లోకేశ్‌ సేవా సమితి పేరుతో అనేక కార్యక్రమాలు నిర్వహించిన నెల్లూరుకు చెందిన మల్లికార్జునరెడ్డికి షుగర్‌ వ్యాధి కారణంగా ఒక కాలు తొలగించాల్సి వచ్చింది. ఇటీవల రెండో కాలుకు పక్షవాతం రావడంతో నడవలేని స్థితిలో ఉన్నారు. ఈ విషయం మంత్రి లోకేశ్‌ దృష్టికి రావడంతో ఆయన పార్టీ తరఫున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మల్లికార్జున్‌రెడ్డి వెంటనే కోలుకోవాలని ఆకాంక్షించారు. లోకేశ్‌ సూచనమేరకు మంత్రి నారాయణ వీడియో కాల్‌ ద్వారా మల్లికార్జునరెడ్డి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. త్వరలో స్వయంగా కలుస్తానని చెప్పారు. సాయం కోరిన వెంటనే స్పందించిన లోకేవ్‌కు మల్లికార్జునరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

తత్కాల్‌ పథకాన్ని వినియోగించుకోండి: లోకేశ్‌

ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం చదువుతూ సకాలంలో పరీక్ష ఫీజు చెల్లించని విద్యార్థుల అభ్యర్థన మేరకు తత్కాల్‌ పథకాన్ని ప్రవేశపెట్టామని విద్యాశాఖ మంత్రి లోకేశ్‌ తెలిపారు. ‘నిర్ణీత రుసుముతో ఈనెల 31 వరకు పరీక్ష ఫీజు చెల్లించే అవకాశాన్ని కల్పించాం. వివిధ కారణాల వల్ల పరీక్ష ఫీజు చెల్లించని వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి’ అని లోకేశ్‌ సోమవారం ‘ఎక్స్‌’లో సూచించారు.

Updated Date - Dec 24 , 2024 | 04:12 AM