AP News: ఎన్నికల నిబంధనలు ఆ నలుగురు అధికారులకి వర్తించవా?
ABN, Publish Date - Mar 27 , 2024 | 08:13 AM
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హరినారాయణన్ తీరుపై తీవ్రస్థాయిలో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల నిబంధనలకి విరుద్ధంగా జిల్లాలోనే నలుగురు ముఖ్య అధికారులు పని చేస్తున్నారు. డీఆర్డీఓ పీడీ సాంబశివారెడ్డి, డీపీఓ సుశ్మిత రెడ్డి, డీఏఓ తిరుపతయ్య, జడ్పీ డిప్యూటీ సీఈఓ చిరంజీవిలు నిబంధనల మేరకు బదిలీ కాలేదు.
నెల్లూరు: నెల్లూరు జిల్లా ఎన్నికల అధికారి (Election Officer), కలెక్టర్ హరినారాయణన్ (District Collector Hari Narayan) తీరుపై తీవ్రస్థాయిలో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల నిబంధనలకి విరుద్ధంగా జిల్లాలోనే నలుగురు ముఖ్య అధికారులు పని చేస్తున్నారు. డీఆర్డీఓ పీడీ సాంబశివారెడ్డి, డీపీఓ సుశ్మిత రెడ్డి, డీఏఓ తిరుపతయ్య, జడ్పీ డిప్యూటీ సీఈఓ చిరంజీవిలు నిబంధనల మేరకు బదిలీ కాలేదు. ఎన్నికల విధుల్లో లేమంటూ జిల్లాలోనే తిష్ఠ వేసుకుని కూర్చొన్నారు.
యథేచ్ఛగా ఎన్నికల కార్యకలాపాలు (Election Duties) నిర్వహిస్తున్నారు. జిల్లా ఎన్నికల అధికారి సమావేశాల్లోనూ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఎన్నికల నిబంధనలు ఆ నలుగురు అధికారులకి వర్తించవా? అంటూ ప్రభుత్వవర్గాల్లో విస్తృత చర్చలు జరుగుతున్నాయి. ఎన్నికల్లో అధికార పార్టీకి అనుకూలంగా చేసేందుకే బదిలీ చేయలేదనే చర్చలు జరుగుతున్నాయి. చిత్తూరు జిల్లాలో ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణలో వైసీపీ (YSRCP)కి అనుకూలంగా వ్యవహారించారనే ఆరోపణలను జిల్లా కలెక్టర్ ఎదుర్కొన్నారు.
Chandrababu: పలమనేరు, పుత్తూరులో నేడు చంద్రబాబు ప్రజాగళంతో ఎన్నికల శంఖారావం..
మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
Updated Date - Mar 27 , 2024 | 08:13 AM