AP News: వైసీపీ నేతలు పవన్ జోలికి వస్తే తాట తీస్తాం: జానీ మాస్టర్
ABN, First Publish Date - 2024-02-10T15:22:12+05:30
గత తెలుగుదేశం ప్రభుత్వంలో పూర్తయిన టిడ్కో ఇళ్లకు వైసీపీ ప్రభుత్వం రంగులు వేసుకుందని.. వాటిని కూడా పేదలకు సరిగా పంపిణీ చేయడం లేదని జనసేన నేత జానీ మాస్టర్(Jani Master) అన్నారు.
నెల్లూరు: గత తెలుగుదేశం ప్రభుత్వంలో పూర్తయిన టిడ్కో ఇళ్లకు వైసీపీ ప్రభుత్వం రంగులు వేసుకుందని.. వాటిని కూడా పేదలకు సరిగా పంపిణీ చేయడం లేదని జనసేన నేత జానీ మాస్టర్(Jani Master) అన్నారు. శనివారం నెల్లూరు నగరంలో జనసేన నేతలు భారీ బైక్ ర్యాలీ తీశారు. టిడ్కో ఇళ్ల వద్ద ఆందోళన చేపట్టారు. పూర్తయిన ఇళ్లను వెంటనే పేదలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జానీ మాస్టర్ మాట్లాడుతూ... వైసీపీ నేతలు పవన్ కళ్యాణ్ జోలికి వస్తే తాటతీస్తామని హెచ్చరించారు. పట్టణంలో పారిశుద్ధ్యం ఘోరంగా ఉందని... తాగడానికి నీళ్లు కూడా లేవని అన్నారు. టిడ్కో ఇళ్లను స్థానిక ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ సంక్రాంతికి ఇస్తానని, ఆ తర్వాత దసరాకు ఇస్తానని పత్తాలేకుండా పోయారని విమర్శించారు.
టిడ్కో ఇళ్లకు వైసీపీ రంగులు వేశారని.. అందుకు ఖర్చు చేసిన డబ్బును పేదలకు ఇచ్చినా బాగుపడేవారని తెలిపారు. ఏపీ వ్యాప్తంగా వైసీపీ నేతలు‘ సిద్ధం’ ఫ్లెక్సీలు వేసుకుంటున్నారని .. వాటికి డబ్బులను ఎక్కడి నుంచి ఖర్చుబెడుతున్నారని ప్రశ్నించారు. వైసీపీ నేతల భవనాలు కళకళలాడాలని... పేదలకు మాత్రం ఇళ్లు లేక బాధపడలా అని నిలదీశారు. జగనన్న ఇళ్లలో భారీ అవినీతి జరగిందని ఆరోపించారు. అవినీతిపై ప్రశ్నిస్తే దాడులు, అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. జనసేన సైనికులంటేనే ప్రాణాలు పణంగా పెట్టి ముందుకెళ్తారన్నారు. పవన్ కళ్యాణ్ తరుపున సామాజిక న్యాయం కోసం తాము పోరాడతామని జానీ మాస్టర్ తెలిపారు.
Updated Date - 2024-02-10T17:00:41+05:30 IST