ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Minister Anam : కృష్ణా, గోదావరి సంగమం దగ్గర జలహారతులు పునరుద్ధరిస్తాం

ABN, Publish Date - Aug 11 , 2024 | 02:53 PM

కృష్ణా, గోదావరి సంగమం దగ్గర జలహారతులు పునరుద్ధరిస్తామని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. జలహారతులపై మంత్రుల కమిటీ ఆదివారం నాడు భేటీ అయింది. దేవస్థానాలకు త్వరలో కొత్త పాలకమండళ్లు నియమిస్తామని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

Minister Anam Ramanaraya Reddy

నెల్లూరు: కృష్ణా, గోదావరి సంగమం దగ్గర జలహారతులు పునరుద్ధరిస్తామని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి (Minister Anam Ramanaraya Reddy) తెలిపారు. జలహారతులపై మంత్రుల కమిటీ ఆదివారం నాడు భేటీ అయింది. దేవస్థానాలకు త్వరలో కొత్త పాలకమండళ్లు నియమిస్తామని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. CGF కింద 160 ఆలయాలు పున: నిర్మిస్తామని ఆనం రామనారాయణరెడ్డి ప్రకటించారు.


ఆలయ భూములు పరిశీలించి ఆక్రమణలు తొలగిస్తామని చెప్పారు. రూ.50వేల కంటే తక్కువ ఆదాయం ఉన్న ఆలయాలకు ఆర్థిక సాయం పెంచుతున్నట్లు ప్రకటించారు. తిరుమల నుంచే దేవాదాయ శాఖలో ప్రక్షాళన చేస్తామని స్పష్టం చేశారు. ఏ చిన్న ఆరోపణలు వచ్చినా నివేదికలు తెప్పించుకుంటున్నామని అన్నారు. నెల్లూరు జిల్లాలో ఐదుగురు దేవాదాయ శాఖ అధికారులపై చర్యలు తీసుకుంటున్నామని హెచ్చరించారు. మరో వివాదాస్పద అధికారిపై విచారణ చేపడతామని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు.


జగన్‌పై బుద్దా వెంకన్న ఆగ్రహం

మరోవైపు.. వైసీపీ అధినేత జగన్‌పై తెలుగుదేశం పార్టీ నేత బుద్దా వెంకన్న (Buddha Venkanna) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అధికారం పోయిన రెండు నెలల్లోనే మతిభ్రమించిందని ఆరోపించారు. ఆయన ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. అధికారం ఉన్నప్పుడు ప్రజలతో డబ్బులతో విర్రవీగాడని, ఇప్పుడు అధికారం దూరం కావడంతో పిచ్చినట్టు అవుతుందో ఏమోనని ఎద్దేవా చేశారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ను జగన్ అవమానించారని మండిపడ్డారు.


విలాసాలు..

‘అధికారం ఉన్నప్పుడు ప్రజల డబ్బులతో జగన్ విలాసలు. అధికారం పోవడంతో జగన్‌కు మతి భ్రమించి ఉంటుంది. అంబేద్కర్ విగ్రహం పెట్టి తన పేరే పట్టుకున్నాడు. అంబేద్కర్ పేరు కన్నా జగన్ పేరు పెద్దదిగా ఉంది. అంబేద్కర్ అభిమానులు జగన్ పేరు తొలగించి ఉండవచ్చు. జగన్ పాలనలో రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేశారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని అవమానించిన వ్యక్తి జగన్. అమరావతిలో అంబేద్కర్ విగ్రహం పెట్టాలని చంద్రబాబు నిర్ణయించారు. రూ.404 కోట్లతో విజయవాడలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు. రూ.226 కోట్లు కొట్టేసిన ఘనుడు జగన్. అంబేద్కర్ విగ్రహాలకు కూడా వైసీపీ రంగులు వేశాడు. అంబేద్కర్‌ను అడుగడుగునా అవమానించిన వ్యక్తి జగన్. దళితులపై దమనకాండకు పాల్పడిన వారిని జగన్ కాపాడారు. బాధిత కుటుంబాలను ఎప్పుడైనా సీఎంగా పరామర్శించావా అని’ బుద్దా వెంకన్న నిప్పులు చెరిగారు.

Updated Date - Aug 11 , 2024 | 05:47 PM

Advertising
Advertising
<