ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Nara Lokesh: కావలి రోడ్డు ప్రమాదంపై లోకేష్ స్పందన

ABN, Publish Date - Jul 02 , 2024 | 12:18 PM

Andhrapradesh: నెల్లూరు జిల్లా కావలి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ స్పందించారు. ఈరోజు (మంగళవారం) పాఠశాల బస్సును లారీ ఢీకొన్న ఘటన తనను తీవ్ర ఆందోళనకు గురిచేసిందన్నారు. ప్రమాదంలో క్లీనర్ చనిపోవడం బాధాకరమన్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన చిన్నారులకు తక్షణమే మెరుగైన వైద్యం అందించాల్సిందిగా అధికారులను ఆదేశించినట్లు చెప్పారు.

Minister Nara lokesh

అమరావతి, జూలై 2: నెల్లూరు జిల్లా (Nellore) కావలి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ (Minister Nara lokesh) స్పందించారు. ఈరోజు (మంగళవారం) పాఠశాల బస్సును లారీ ఢీకొన్న ఘటన తనను తీవ్ర ఆందోళనకు గురిచేసిందన్నారు. ప్రమాదంలో క్లీనర్ చనిపోవడం బాధాకరమన్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన చిన్నారులకు తక్షణమే మెరుగైన వైద్యం అందించాల్సిందిగా అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. స్కూలు యాజమాన్యాలు బస్సులన్నింటినీ కండీషన్‌లో ఉంచుకోవాలని ఆదేశించారు. బస్సుల ఫిట్ నెస్ విషయంలో అత్యంత అప్రమత్తతతో వ్యవహరించాల్సిందిగా మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు.

AP Pension: ప్రొద్దుటూరులో ఫించన్ డబ్బుల మిస్సింగ్‌లో అసలు నిజం ఇదీ!


ప్రమాదం జరిగిందిలా..

కావలి జాతీయ రహదారిపై మంగళవారం రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆర్ఎస్ఆర్ స్కూల్ బస్సును వేగంగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందాడు. అలాగే స్కూల్ బస్సులో పది మంది విద్యార్ధులకు గాయాలయ్యాయి. మరో అయిదుగురు విద్యార్ధులకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన విద్యార్థులను కావలిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


ఇవి కూడా చదవండి....

AP Pensions: పెన్షన్ల పంపిణీలో చేతివాటం.. రూ. 200 కోత

YouTube: యూట్యూబ్‌లో కొత్త ఫీచర్.. మీ వాయిస్, ఫేస్ ఉపయోగించి రూపొందించే ఏఐ వీడియోలపై ఫిర్యాదు చేయవచ్చు..

Read Latest AP News AND Telugu News

Updated Date - Jul 02 , 2024 | 12:20 PM

Advertising
Advertising