Minister Narayana: నేను అప్పుడు ఫెయిల్ అయ్యా.. ఆసక్తికర విషయాలు బయటపెట్టిన మంత్రి నారాయణ
ABN, Publish Date - Dec 07 , 2024 | 11:50 AM
తల్లిదండ్రులు కూడా పిల్లలపై శ్రద్ధ పెడితే, ఉన్నత స్థాయికి చేరతారనిమంత్రి నారాయణ అన్నారు. ‘నేను 1972లో పదో తరగతిలో ఫెయిల్ అయ్యాను. నాలో కసి పెరిగి డిగ్రీ, పీజీలో కళాశాల ఫస్ట్ క్లాస్ స్టూడెంట్‌గా తయారు అయ్యాను’’ అని మంత్రి నారాయణ గుర్తుచేసుకున్నారు.
నెల్లూరు: మార్కులు తక్కువ వచ్చాయని పిల్లలను తిట్టకుండా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని మంత్రి నారాయణ సూచించారు. ఏపీలో 45094 పాఠశాలల్లో 36 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారని తెలిపారు. నెల్లూరు నగరంలోని బీవీఎస్ గర్ల్స్ హైస్కూల్లో ఇవాళ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్‌లో మంత్రి నారాయణ పాల్గొని మాట్లాడారు. దేశంలోనే ఇంత పెద్దఎత్తున పేరెంట్స్, టీచర్లతో సమావేశాలు నిర్వహించడం గొప్ప విషయమని అన్నారు. జిల్లాలోని 2604 పాఠశాలల్లో బడి పండుగ జరుపుతున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు.
ALSO READ: Borugadda Anil: రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్‌పై మరో కేసు
మెగా పేరెంట్, టీచర్ మీటింగులకి భారీ ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. పాఠశాలల్లో వసతులు, అభివృద్ధిపై విస్తృతంగా చర్చించామన్నారు. తాను టీచర్‌గా పని చేశానని.. విద్యార్థులు ఐక్యూ ఎలా ఉంటుందో తనకు తెలుసునని చెప్పారు. ప్రతి విద్యార్థి మేథావేనని.. వారికి ప్రభుత్వం తరుపున ప్రోత్సహం, శిక్షణ పునాదులు ఉండాలని సూచించారు. తల్లిదండ్రులు కూడా పిల్లలపై శ్రద్ధ పెడితే, ఉన్నత స్థాయికి చేరుతారని అన్నారు. ‘నేను 1972లో పదో తరగతిలో ఫెయిల్ అయ్యాను. నాలో కసి పెరిగి డిగ్రీ,, పీజీలో కళాశాల ఫస్ట్ క్లాస్ స్టూడెంట్‌గా తయారు అయ్యాను’’ అని గుర్తుచేసుకున్నారు. విద్యార్థికి ఫౌండేషన్ విద్య చాలా అవసరమన్నారు. మంత్రి లోకేష్ విద్యాశాఖలో పలు మార్పులకు శ్రీకారం చుట్టారని మంత్రి నారాయణ పేర్కొన్నారు.
ALSO READ: Minister Lokesh :మంత్రి లోకేశ్ ప్రజాదర్బార్‌కు 50 రోజులు
నందిగామ, నూజివీడులో కేంద్రీయ విద్యాలయాలు: విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్
విజయవాడ: నందిగామ, నూజివీడులో కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని తెలుగుదేశం పార్టీ విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) తెలిపారు. నందిగామ, నూజివీడులో కేంద్రీయ విద్యాలయాల ప్రారంభానికి లైన్ క్లియర్ అయిందని చెప్పారు. ఢిల్లీలో ఆగస్ట్ 6వ తేదీ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను కలిశానని ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. నందిగామ, నూజివీడులో కేంద్రీయ విద్యాయాలను ఏర్పాటు చేయాలని వినతి పత్రం అందజేశానని గుర్తుచేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు ఎంపీ కేశినేని శివనాథ్ కృతజ్ఞతలు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి
YSRCP: వైసీపీ కీలక నేత అరెస్ట్.. ఎందుకంటే
AP High Court : గంజాయి కేసుల్లో ఇదేం తీరు?
CBI : ‘కంటెయినర్‌లో డ్రగ్స్’ కథ కంచికి!?
Read Latest AP News And Telugu News
Updated Date - Dec 07 , 2024 | 11:59 AM