YSRCP: ‘‘యూజ్‌లెస్ ఫెలోస్’’ అంటూ నోరుపారేసుకున్న వైసీపీ ఎమ్మెల్యే
ABN, Publish Date - Mar 22 , 2024 | 10:19 AM
Andhrapradesh: ఏపీలో అభివృద్ధిపై అధికారపార్టీ వైసీపీ నేతలను ఎక్కడికక్కడ ప్రజలు నిలదీస్తున్న విషయం తెలిసిందే. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులను సమస్యలపై మహిళలు, యువత ప్రశ్నిస్తూనే ఎందుకు వచ్చారంటూ నిలదీసిన సందర్భాలు ఎన్నో. కొందరు నేతలకు తమ సొంత నియోజకవర్గాల్లో కూడా ప్రజల నుంచి ఛీత్కారాలు ఎదుర్కున్న విషయం తెలిసిందే.
నెల్లూరు, మార్చి 22: ఏపీలో అభివృద్ధిపై అధికారపార్టీ వైసీపీ నేతలను (YSRCP Leaders) ఎక్కడికక్కడ ప్రజలు నిలదీస్తున్న విషయం తెలిసిందే. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యేలు (YSRCP MLAs), మంత్రులను సమస్యలపై మహిళలు, యువత ప్రశ్నిస్తూనే ఎందుకు వచ్చారంటూ నిలదీసిన సందర్భాలు ఎన్నో. కొందరు నేతలకు తమ సొంత నియోజకవర్గాల్లో కూడా ప్రజల నుంచి ఛీత్కారాలు ఎదుర్కున్న విషయం తెలిసిందే. మరోసారి వైసీపీని గెలిపించండి అంటూ వచ్చిన అధికార పార్టీ నేతలను రోడ్లు, ఇళ్లు, డ్రైనేజీ, నీటి సమస్య ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సమస్యలపై అడుగడుగునా ప్రజలు అడ్డుకుంటూనే ఉన్నారు. ఎన్నికల వేళ ప్రచారానికి వస్తున్న నేతలను కూడా విడిచిపెట్టని పరిస్థితి.
Lanka Dinakar: ఏందయ్యా జగనయ్యా.. ఏపీని గంజా ప్రదేశ్‌గా మార్చేశావ్ కదా!
ఎమ్మెల్యేకు ఘోర పరాభవం..
తాజాగా ఆత్మకూరు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డికి (YSRCP MLA Mekapati Vikram Reddy) ఘోరపరాభవం ఎదురైంది. సొంత మండలమైన మర్రిపాడులోని చినమాచనూరులో సమస్యలపై అడుగడుగునా మహిళలు నిలదీశారు. సోమశిల డ్యాం చెంతనే ఉన్నప్పటికీ తాగు, సాగు నీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్లు, వీధి దీపాలు వేయలేని వారికి రాజకీయాలు ఎందుకంటూ మేకపాటిపై మండిపడ్డారు. అయితే సమస్యలపై ప్రశ్నిస్తున్న ప్రజల పట్ల వైసీపీ ఎమ్మెల్యే తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రశ్నించిన వారిపై ‘‘యూజ్ లెస్ ఫెలో’’ అంటూ మేకపాటి నోరుపారేసుకున్నారు. చివరకు ఎన్నికల ప్రచారాన్ని మధ్యలోనే నిలిపేసి ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి వెళ్లిపోయారు. అయితే ఎమ్మెల్యే తీరుపట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి...
AP Elections: ఎమ్మెల్యే ద్వారంపూడిని ఏకిపారేసిన జనం..
Rajasthan: 20 సెకన్లలో 10 కత్తిపోట్లు.. అమ్మాయిపై వ్యక్తి ఘాతుకం..!
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...
Updated Date - Mar 22 , 2024 | 10:48 AM