Viral News: నెల్లూరులో.. యువకుడిని చితక్కొట్టిన దెయ్యం..!
ABN, Publish Date - Dec 23 , 2024 | 04:38 PM
దెయ్యం.. కళ్లకి కనిపించదు. ఉందో.. లేదో.. కూడా నిర్ధారించడం కష్టం. కానీ, ఈ పేరు వింటేనే చాలామందికి హడల్! సినిమాల్లో చూపించినట్లుగా నిర్మానుష్యమైన ప్రాంతాలు, పాడుబడ్డ బంగాళాల్లో దెయ్యాలు తిరుగుతుంటాయని నమ్ముతుంటారు. కొందరేమో, ఈ కాలంలో కూడా ఆత్మల గోలేంటని కొట్టిపడేస్తారు. ఇప్పుడిదే విషయం చర్చనీయాంశంగా మారింది నెల్లూరు జిల్లాలో. పగలు, రాత్రి తేడా లేకుండా రోడ్లపై తిరిగేవాళ్లపై దెయ్యం దాడిచేస్తోందనే పుకార్లు షికారు చేస్తున్నాయి. ఇంతకీ, ఏం జరిగిందంటే..

నెల్లూరు : దెయ్యం పేరు చెబితే ఎలాంటి వారైనా భయపడాల్సిందే.. నేటి ఆధునిక కాలంలోనూ దెయ్యాలకు సంబంధించిన ఘటనలు ఎన్నో వింటుంటాం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చనిపోయిన కొందరు వ్యక్తులు పగ తీర్చుకునేందుకు దెయ్యాలుగా వచ్చారనే ప్రచారానికి సంబంధించిన ఘటనల గురించి విన్నాం. ముఖ్యంగా పిల్లలు మారాం చేస్తే దెయ్యం వచ్చి తినేస్తోందంటూ భయపెడుతూ ఉంటారు. చెట్లపై దెయ్యాలు ఉంటుంటాయనే మూఢ నమ్మకాల గురించి విన్నాం.
గ్రామీణ ప్రాంతాల్లో రాత్రి 8 దాటితే ఫలానా దారిలో పోవద్దని పెద్దలు చెబుతుంటారు. ఫలానా ప్రాంతంలో దెయ్యం ఉంటుంది. అటువైపుగా పోవద్దని చెబుతారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం ఈ మూఢనమ్మకాలు కొంచెం తగ్గాయనే చెప్పుకోవాలి. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందుతుండటంతో పాటు.. మండల, జిల్లా కేంద్రాలతో అనుసంధానం చేస్తుండటంతో ప్రజల్లో కొంతమేరకు భయాందోళనలు తగ్గుతున్నాయి. అయినప్పటికీ, అక్కడక్కడ దెయ్యాలు తిరుగుతున్నాయనే వార్తలు అప్పుడప్పుడు వినిపిస్తూనే ఉంటాయి. తాజాగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఇలాంటి ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఆ జిల్లాలో దెయ్యం పేరు చెబితే ప్రజలు హడలిపోతున్నారు. ఆ ప్రాంతానికి రాత్రి సమయంలో వెళ్లాలంటే భయపడిపోతున్నారు.
జొన్నవాడ రోడ్డులో..
నెల్లూరు జిల్లా జొన్నవాడ రోడ్డులో ట్రాన్స్ జెండర్ రూపంలో దెయ్యం తిరుగుతుందనే పుకార్లు జిల్లా మొత్తం వ్యాపించాయి. ఇటీవల ఓ యుడకుడిపై దెయ్యం దాడికి పాల్పడిందని, నెల్లూరులోని ఓ ఆసుపత్రిలో యువకుడు చికిత్స పొందుతున్నాడనే ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. అయితే ఇది కేవలం పుకార్లు మాత్రమేనని, ఇందులో ఎలాంటి వాస్తవం లేదని అధికారులు చెబుతున్నారు. కొందరైతే సోషల్ మీడియాలో దెయ్యానికి సంబంధించిన అంశాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. దీంతో స్థానికులు భయాందోళన చెందడంతో పాటు.. అటుగా వెళ్లాలంటే ఎవరైనా భయపడే పరిస్థితి నెలకొంది.
ఈ క్రమంలో సోషల్ మీడియాలో దెయ్యాల పేరిట ఎవరైనా పుకార్లు వ్యాప్తి చేసినా, అసత్య ప్రచారం చేసినా చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు. గతంలోనూ దెయ్యం సంచరిస్తుందనే వార్తలు వచ్చాయి. అయినప్పటికీ ఎక్కడా దెయ్యాలు సంచరిస్తున్నాయడానికి ఆధారాలు లభించకపోవడంతో అధికారులు వీటిని పుకార్లుగానే చూస్తున్నారు.
Updated Date - Dec 23 , 2024 | 05:59 PM