ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Nellore: ట్రాన్స్‌జెండర్ హాసిని హత్య కేసులో సంచలన విషయాలు వెల్లడి..

ABN, Publish Date - Dec 01 , 2024 | 01:58 PM

నెల్లూరు జిల్లాలో కలకలం రేపిన ట్రాన్స్‌జెండర్ హాసిని హత్య కేసులో ఎస్పీ కృష్ణకాంత్ సంచలన విషయాలు వెల్లడించారు. ట్రాన్స్‌జెండర్ల మధ్య ఆధిపత్య పోరే హత్యకి కారణమని ఆయన తెలిపారు. ఈ కేసులో 12 మందిని అరెస్టు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు.

నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ట్రాన్స్‌జెండర్ హాసిని హత్య కేసుని నెల్లూరు పోలీసులు ఛేదించారు. ట్రాన్స్‌జెండర్ల లీడర్లు హాసిని, అలేఖ్య మధ్య ఆధిపత్య పోరే హత్యకి కారణమని ఎస్పీ కృష్ణకాంత్ వెల్లడించారు. హత్యకు పాల్పడిన15 మంది నిందితుల్లో 12 మందిని అరెస్టు చేసినట్లు ఎస్పీ తెలిపారు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారని, వారి కోసం ముమ్మరంగా గాలిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. హత్యకి పాల్పడిన వారిలో పాతనేరస్థులు, రౌడీ షీటర్లు ఉన్నట్లు విచారణలో గుర్తించినట్లు కృష్ణకాంత్ తెలిపారు. వారికి సుపారీ ఇచ్చిన ట్రాన్స్‌జెండర్ల లీడర్లు అలేఖ్య, షీలా హత్య చేయించారని ఎస్పీ కృష్ణకాంత్ వెల్లడించారు.


అసలేం జరిగిందంటే..

నెల్లూరు దీన్‌దయాళ్‌నగర్‌కు చెందిన ట్రాన్స్‌జెండర్ల నాయకురాలు హాసిని కొన్ని రోజులుగా తిరుపతి మంగళం ప్రాంతంలో నివాసం ఉంటోంది. ఈమెకు తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో బలమైన వర్గముంది. నవంబర్ 26న విడవలూరు మండలం పార్లపల్లి సమీపంలో మహాలక్ష్మమ్మ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ చేయించిన అనంతరం హాసిని అర్ధరాత్రి తన కారులో తిరుగు ప్రయాణం అయ్యింది. అయితే నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం టపాతోపు రైల్వే అండర్‌ బ్రిడ్జి వద్దకు రాగానే గుర్తుతెలియని వ్యక్తులు కారులో వచ్చి ఆమె కారును అడ్డుకున్నా రు. హిజ్రాను బలవంతంగా బయటకు లాగి మెడ, వీపు, ఇతర శరీర భాగాలపై కత్తులతో దాడి చేశారు. అదే సమయంలో వెనక ఆటోలో వస్తున్న హిజ్రాలను చూసి దుండగులు అక్కడ్నుంచి పరారయ్యారు. అప్పటికే తీవ్రంగా గాయపడిన ఆమెను అంబులెన్స్‌లో నెల్లూరులోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించే లోపే ఆమె ప్రాణాలు కోల్పోయింది.


హాసిని హత్యకు గురైన విషయం తెలుసుకున్న నెల్లూరు, కడప, గుంటూరు, ప్రకాశం, తిరుపతి, చిత్తూరు జిల్లాలతోపాటు తమిళనాడు నుంచి భారీ సంఖ్యలో హిజ్రాలు బుధవారం నెల్లూరుకు చేరుకున్నారు. నెల్లూరు రూరల్‌ డీఎస్పీ గట్టమనేని శ్రీనివాసరావును కలిసి తమ నాయకురాలిని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. అనంతరం జీజీహెచ్‌ మార్చురీలో హాసిని మృతదేహానికి పోస్టుమార్టం జరుగుతోందని తెలిసి అక్కడికి చేరుకున్నారు. ఆస్పత్రి వద్ద బైఠాయించి ఆందోళన చేపట్టారు. పోస్టుమార్టం పూర్తయ్యాక మృతదేహాన్ని అంబులెన్స్‌లో తిరుపతికి తరలించారు. ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు కేసును ఛేదించి నిందితులను అరెస్టు చేశారు.

Updated Date - Dec 01 , 2024 | 01:58 PM