Somireddy Chandramohan Reddy: అవినీతి, దోపిడీల్లో జగన్‌కి షేర్ ఎంత?
ABN, Publish Date - Mar 12 , 2024 | 01:25 PM
నెల్లూరు జిల్లాలో ఇరిగేషన్ డిపార్ట్‌మెంటులో వందల కోట్లు అవినీతి జరిగిందని మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్ది తెలిపారు. ఒక్క సర్వేపల్లిలోనే రూ.300 కోట్లు పనులు చేయకుండానే డబ్బులు డ్రా చేశారన్నారు. సెంట్రల్ డివిజన్ నుంచి శ్రీధర్ ఇంజనీరింగ్ కంపెనీకి కట్టబెట్టారన్నారు.
నెల్లూరు: నెల్లూరు జిల్లాలో ఇరిగేషన్ డిపార్ట్‌మెంటులో వందల కోట్లు అవినీతి జరిగిందని మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్ది (Somireddy Chandramohan Reddy) తెలిపారు. ఒక్క సర్వేపల్లిలోనే రూ.300 కోట్లు పనులు చేయకుండానే డబ్బులు డ్రా చేశారన్నారు. సెంట్రల్ డివిజన్ నుంచి శ్రీధర్ ఇంజనీరింగ్ కంపెనీకి కట్టబెట్టారన్నారు. హెడ్ రెగ్యులేటర్ షటర్స్ పనులు ప్రతి సంవత్సరం చేయాల్సిన అవసరం లేదన్నారు. పనులు జరగకుండానే డబ్బులు డ్రా చేశారన్నారు. ఒక్క రాయి నాటకుండా, ట్రెంచ్ తీయకుండా, కాలవల్లో పార పెట్టకుండా డబ్బులు డ్రా చేశారని సోమిరెడ్డి తెలిపారు.
MP Avinash Reddy: అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు కోరుతూ దస్తగిరి మరో పిటిషన్
ఎఫ్డీఆర్ ఓఅండ్ఎం, ఎన్ఆర్ఈజీఎస్ పనులు అన్ని అవినీతిమయమేనని సోమిరెడ్డి పేర్కొన్నారు. ఒకే పనిని మళ్లీ మళ్లీ చేస్తూ దోపిడి చేస్తున్నారన్నారు. శ్రీధర్, నిరంజన్ ఇద్దరూ మంత్రి కాకణి బినామీలన్నారు. పది మంది ఆఫీసర్లకు నెల రోజుల క్రితం పంపినా ఒక్కరి మీద కూడా యాక్షన్ తీసుకోలేదన్నారు. జిల్లాలో జరిగిన అవినీతి లెక్క తేలాలన్నారు. మంత్రి కాకణి (Minister Kakani) నియోజకవర్గంలో అవినీతికి హద్దు లేకుండా పోయిందని సోమిరెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ (CM Jagan)కి జిల్లాలో జరిగే అవినీతి, దోపిడీల్లో షేర్ ఎంతో చెప్పాలన్నారు. కలెక్టర్, ఇరిగేషన్ అధికారులు, మంత్రిని హెచ్చరిస్తున్నామన్నారు. రాబోయే టీడీపీ (TDP) ప్రభుత్వంలో ప్రత్యేక కమిటీలు వేయించి దోపిడీ చేసే వారిని ఊచలు లెక్కపెట్టిస్తామన్నారు. వ్యవసాయ, ఇరిగేషన్ మంత్రులు పనులు చేయకుండానే దోచుకున్నారని సోమిరెడ్డి తెలిపారు.
CM Jagan: అన్నీ జగన్ ఖాతాలోకే... సెల్ఫ్ డబ్బా కొట్టుకున్న సీఎం
మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
Updated Date - Mar 12 , 2024 | 01:27 PM