ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Anam: యేసు ప్రభు, శ్రీవారితో పెట్టుకున్నావ్.. భస్మమైపోతావ్ జగన్

ABN, Publish Date - Sep 27 , 2024 | 12:35 PM

Andhrapradesh: వైఎస్ జగన్... హాఫ్ టిక్కెట్... హిందువా? క్రిష్టియనా? అంటూ ఆనం వెంకటరమణారెడ్డి ప్రశ్నించారు. జగన్ ముత్తాత వెంకటరెడ్డి ముఠా నాయకుడని... వందేళ్ల కిందట 1925లో క్రిష్టియన్‌గా మారారని... అప్పటి నుంచి వారి కుటుంబమంతా ఏసుప్రభువునే నమ్ముకున్నారని తెలిపారు.

TDP Leader Anam Venkataramana Reddy

నెల్లూరు, సెప్టెంబర్ 27: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై (Former CM YS Jaganmohan Reddy) టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి (TDP Leader Anam Venkataramana Reddy) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ తిరుమల పర్యటన నేపథ్యంలో డిక్లరేషన్‌ అంశం తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. జగన్ డిక్లరేషన్‌ ఇస్తారా అనే అంశం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై ఆనం మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్... హాఫ్ టిక్కెట్... హిందువా? క్రిష్టియనా? అంటూ ప్రశ్నించారు. జగన్ ముత్తాత వెంకటరెడ్డి ముఠా నాయకుడని... వందేళ్ల కిందట 1925లో క్రిష్టియన్‌గా మారారని... అప్పటి నుంచి వారి కుటుంబమంతా ఏసుప్రభువునే నమ్ముకున్నారని తెలిపారు. వైఎస్ తల్లి జయమ్మ, భార్య విజయమ్మ, జగన్ భార్య భారతి, చెల్లెలు షర్మిలా క్రిష్టియనే అని అన్నారు.

Viral News: లిప్‌స్టిక్‌తో వచ్చారని ట్రాన్స్‌ఫర్ చేసేశారు.. తర్వాత ఏమైందంటే..


నీ భార్య, కుమార్తెలను తీసుకుని రా...

‘‘సాక్షాత్తు విమలమ్మ మా తాత 1925లో క్రైస్తవుడిగా మారాడని చెప్పారు. రాయలసీమలో ముఠా నాయకుడని విమలమ్మ చెప్పింది. జగన్ నువ్వు ఎవరిని మోసం చేస్తున్నావ్? మీ అమ్మమ్మ పేరు మీద పులివెందులలో చర్చి కట్టారా? లేదా? జగన్... నీకు, భారతితో క్రిష్టియన్ పెళ్లి జరిగింది. నీ తండ్రి.. మా పెద్దాయన... వైఎస్ చనిపోయినప్పుడు క్రిష్టియన్ పద్ధతిలో అంత్యక్రియలు జరిగాయా? లేదా? జగన్.. సీబీఐకి ఇచ్చిన అఫెడవిట్‌లో క్రిష్టియన్‌గా చెప్పాడు. యేసు ప్రభువా?... తండ్రీ... నీ బిడ్డ క్రిష్టియన్ కాదంటున్నాడు. భస్మం చేయి... ప్రభువా...ప్రభువు తన ఎదురు ఏ దేవుడూ లేడని, తన తరువాత ఎవరూ ఉండరని చెప్పాడు. రెండు మతాల్లో ఉండొద్దన్నాడు. రా... తిరుమలకి రా... నీ భార్య, కుమార్తెలని తీసుకుని రా... తలనీలాలు ఇవ్వు. నువ్వు హిందువు, నీ భార్య భారతి, తల్లి క్రిష్టియన్లా?... జగన్ శవయాత్ర చేసేటప్పుడే మొట్టమొదట తిరుమలకి వచ్చాడు. పెళ్లయ్యాక వచ్చావా? పిల్లలకి అన్నప్రాసన చేశావా?’’ అంటూ టీడీపీ నేత ప్రశ్నలు సంధించారు.

Tirumala: జగన్ పర్యటనపై వివాదం.. నోరుమెదపని వైసీపీ


కోన్ కిస్క గొట్టంగాళ్లు...

క్రిష్టియన్ సోదరులారా ఒక్కసారి కళ్లు తెరిచి ఆలోచించండి. జగన్ కుటుంబమంతా దొంగలు. ఆ దొంగలని నమ్మొద్దు. యేసు ప్రభువు... వెంకటేశ్వరస్వామితో పెట్టుకున్నావ్... భస్మమైపోతావ్... నువ్వేమైనా తోపా... సోనియా గాంధీ, ఫరుఖ్ అబ్దుల్లా, అబ్దుల్ కలాం, మహ్మద్ జానీ సంతకాలు పెట్టి ఆలయంలోకి వెళ్లారు. మీరేమైనా దేవుళ్లకి దేవుళ్లా? కోన్ కిస్క గొట్టంగాళ్లు... మీరు. ఎవరికంటే నువ్వు గొప్పా... ఒరేయ్ సుబ్బిగా... నువ్వు గురుస్వామివా? టీటీడీ ఛైర్మన్‌గా ఉండి పింక్ డైమండ్ కేసు విత్ డ్రా చేసుకుంటావా?... ఒరేయ్ పంది వెధవ.. పొన్నవోలు... కేజ్, కేజ్ ఏందిరా... ఇంగ్లీషు రాకపోతే కిలోలని అనరా? నీకెట్టా ఇచ్చాడ్రా... ఆ పోస్టు. కనపర్తి‌పాడులో పందులు మేపేవాడు కాబట్టి, పంది మాంసం ధరలు చెబుతున్నాడు’’ జగన్, వైవీ సుబ్బారెడ్డి, పొన్నవోలు సుధాకర్‌పై ఆనం వెంకటరమణరెడ్డి ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు.


ఇవి కూడా చదవండి..

Devara movie: ‘దేవర’ చిత్రం విడుదలలో అపశృతి

Tirumala: కాక రేపుతున్న జగన్ తిరుమల పర్యటన

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 27 , 2024 | 12:40 PM