Tourism Development : విశాఖలో నేపాల్ కాన్సులేట్!
ABN, Publish Date - Dec 27 , 2024 | 04:15 AM
పర్యాటక అభివృద్ధిలో నేపాల్, ఆంధ్రప్రదేశ్ పరస్పర సహకారంతో ముందుకు సాగుతాయని నేపాల్ హై కమిషనర్ డాక్టర్ సురేందర్ తాపా పేర్కొన్నారు.
ఏపీలో పర్యాటక అభివృద్ధికి పరస్పర సహకారం
నేపాల్ హై కమిషనర్ డాక్టర్ సురేందర్ తాపా వెల్లడి
మహారాణిపేట(విశాఖపట్నం), డిసెంబరు 26(ఆంధ్రజ్యోతి): పర్యాటక అభివృద్ధిలో నేపాల్, ఆంధ్రప్రదేశ్ పరస్పర సహకారంతో ముందుకు సాగుతాయని నేపాల్ హై కమిషనర్ డాక్టర్ సురేందర్ తాపా పేర్కొన్నారు. ఇందులో భాగంగా నేపాల్ కాన్సులేట్ కార్యాలయాన్ని విశాఖలో ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. గురువారం ఇక్కడి ఓ హోటల్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశాఖ పర్యాటకంగా ఆకట్టుకుంటోందన్నారు. సాగర తీరంతోపాటు అనేక పర్యాటక ప్రదేశాలు సందర్శించామని, నేపాల్ నుంచి పర్యాటకులను ఇక్కడకు పంపించే బాధ్యత తీసుకుంటామని చెప్పారు. ఈ సమావేశంలో ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ నూకసాని బాలాజీ, నేపాల్ మంత్రి తార్నద్, ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షుడు సాంబశివరావు, ఏపీ ఎయిర్ ట్రావెల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఓరుగంటి నరే్‌షకుమార్, దసపల్లా గ్రూపు చైర్మన్ రాఘవేంద్రరావు, కన్నెగంటి విజయ్‌మోహన్, పవన్ కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Dec 27 , 2024 | 04:15 AM