Tirupati: మలుపు తిరిగిన ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య కేసు
ABN, First Publish Date - 2024-02-06T21:37:40+05:30
ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య కేసు కొత్త మలుపు తిరిగింది. కార్పొరేట్ కళాశాలలో ఎంపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్య జరిగిన విషయం తెలిసిందే. గత నెల 27న ఆత్మహత్య కేసు నమోదు చేశారు. అయితే...
తిరుపతి: ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య కేసు కొత్త మలుపు తిరిగింది. కార్పొరేట్ కళాశాలలో ఎంపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్య జరిగిన విషయం తెలిసిందే. గత నెల 27న ఆత్మహత్య కేసు నమోదు చేశారు. అయితే విద్యార్థిని మృతిపై అనుమానం వ్యక్తి చేసిన ఆమె తల్లిదండ్రులు.. కూతురు పుస్తకాలు మొత్తం వెతికారు. అందులో ఓ సూసైడ్ నోట్ బయటపడింది. సూసైడ్ నోట్ ఆధారంగా విద్యార్థిని అత్యాచారానికి గురైనట్లు తెలిసింది.
విచారణ చేపట్టిన ఈస్ట్ డీఎస్పీ.. విద్యార్థి మృతికి ఆమె గ్రామానికి చెందిన గంగాధర్ అరే ఎలక్ట్రిషన్ నిందితుడని తేల్చారు. గంగాధర్ వ్యవహరించిన తీరును జీర్ణించుకోలేకే విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నట్లు తేలింది. విద్యార్థి తల్లిదండ్రులు ఫిర్యాదుతో పోలీసులు ఈ విచారణ చేపట్టారు. సూసైడ్ నోట్ ఆధారంగా విద్యార్థిని గర్భవతిని చేసి, అబార్షన్ చేయించిన యువకుడిపై ఫోక్సో కేసు నమోదు చేశారు. నిందితుడు గంగాధర్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని, కేసు దర్యాప్తు చేస్తున్న ఈస్ట్ డీఎస్పీ సురేందర్ రెడ్డి తెలిపారు. కాగా, మరోవైపు ఈ ఘటనపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
Updated Date - 2024-02-06T21:37:41+05:30 IST