ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Nimmala Ramanaidu : రూ.6వేల కోట్లకు టిడ్కో ఇళ్ల తాకట్టు

ABN, Publish Date - Jul 08 , 2024 | 03:22 AM

గత ప్రభుత్వ హయాంలో జగన్‌ టిడ్కో గృహాలను ఆరువేల కోట్ల రూపాయలకు తాకట్టు పెట్టి ఆ నిధులను దారి మళ్లించారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు.

ఏ పదవికీ జగన్‌ అర్హుడు కాదు: మంత్రి నిమ్మల

పాలకొల్లు రూరల్‌/ అర్బన్‌, జూలై 7: గత ప్రభుత్వ హయాంలో జగన్‌ టిడ్కో గృహాలను ఆరువేల కోట్ల రూపాయలకు తాకట్టు పెట్టి ఆ నిధులను దారి మళ్లించారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. లబ్ధిదారులను వైసీపీ రుణగ్రస్తులుగా మార్చిందన్నారు.

ఆదివారం పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులోని టిడ్కో గృహాల సముదాయం ఆవరణలో అడవి మాదిరిగా పెరిగిన పొదలు, మట్టి గుట్టలను టీడీపీ నాయకులతో కలిసి తొలగించే పనులను మంత్రి చేపట్టారు. ఒకరోజు శ్రమదానం సరిపోదని, వారంపాటు చేయాల్సి ఉంటుందని అన్నారు. తమ ప్రభుత్వం టిడ్కో ఇళ్లను 90శాతం పూర్తి చేస్తే, మిగిలిన 10శాతం పనులు కూడా గత వైసీపీ ప్రభుత్వం చేయలేదని మండిపడ్డారు. ఐదేళ్లూ వ్యవస్థలను నాశనం చేసేసిన జగన్‌.. ప్రజాస్వామ్యంలో ఏపదవికీ అర్హుడు కాదని ఘాటుగా విమర్శించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ అంగర రామమోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 08 , 2024 | 03:22 AM

Advertising
Advertising
<