ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AndhraPradesh: రాజ్యసభ ఉప ఎన్నికకు ముగిసిన నామినేషన్ల ప్రక్రియ

ABN, Publish Date - Dec 10 , 2024 | 01:26 PM

గత ప్రభుత్వ హయాంలో మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావుతోపాటు ఆర్ కృష్ణయ్యలను వైసీపీ అధినేత వైఎస్ జగన్ పెద్దల సభకు పంపారు. కానీ ఈ ఏడాది మే, జూన్ మాసాల్లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలతోపాటు సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో వైఎస్ జగన్ సారథ్యంలోని వైసీపీ కేవలం 11 స్థానాలనే గెలుచుకుంది.

అమరావతి, డిసెంబర్ 10: ఆంధ్రప్రదేశ్‍లో రాజ్యసభ ఉప ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ ప్రక్రియ మంగళవారం పూర్తయింది. రాజ్యసభ అభ్యర్థులుగా టీడీపీ నుంచి సానా సతీష్, బీద మస్తాన్ రావులు.. అలాగే బీజేపీ నుంచి బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య నామినేషన్‍లు దాఖలు చేశారు. డిసెంబర్ 20వ తేదీన ఈ ఉప ఎన్నిక జరగనుంది. అదే రోజు ఫలితాలను ప్రకటిస్తారు.

Also Read: కేబినేట్ భేటి ముందుకు జమిలి ఎన్నికల బిల్లు


అయితే గత ప్రభుత్వ హయాంలో మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావుతోపాటు ఆర్ కృష్ణయ్యలను వైసీపీ అధినేత వైఎస్ జగన్ పెద్దల సభకు పంపారు. కానీ ఈ ఏడాది మే, జూన్ మాసంలో ఏపీ అసెంబ్లీ ఎన్నికలతోపాటు సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో వైఎస్ జగన్ సారథ్యంలోని వైసీపీ కేవలం 11 స్థానాలనే గెలుచుకుంది. ఇక ఆంధ్రప్రదేశ్ ఓటర్ కూటమికి పట్టం కట్టాడు.

Also Read: మమతకు మద్దతు తెలిపిన మాజీ సీఎం


దీంతో చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. ఆ క్రమంలో వైసీపీకి పలువురు కీలక నేతలు రాజీనామాలు చేశారు. వారిలో మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావులు పార్టీ ప్రాథమిక సభ్యత్వంతోపాటు రాజ్యసభ స్థానాలకు రాజీనామా చేశారు. అలాగే బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య సైతం తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.

Also Read: బస్సు బీభత్సం.. ఏడుగురు మృతి


దాంతో రాజ్యసభ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో ఈ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. అలాగే ఒడిశా, పశ్చిమబెంగాల్, హర్యానా నుంచి ఒక్కొ స్థానానికి రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి.

Also Read: మొబైల్, ఇంటర్నెట్ సేవలపై నిషేధం ఎత్తివేత


మరోవైపు.. ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వాటిలో 164 స్థానాలను కూటమి అభ్యర్థులు కైవసం చేసుకున్నారు. దీంతో వైసీపీ ప్రతిపక్ష హోదా సైతం దక్కలేదు. ఇక ఒక్క రాజ్యసభ అభ్యర్థి విజయం సాధించాలంటే.. 25 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరమవుతోంది. కానీ వైసీపీకి ఆ సంఖ్యా బలం సైతం లేదు. దాంతో ఆ పార్టీ.. తన అభ్యర్థిని బరిలో దింపలేదు. దీంతో టీడీపీ, బీజేపీ నుంచి బరిలో దిగిన మొత్తం ముగ్గురు ఈ ఉప ఎన్నికల్లో విజయం సాధించడం ఖాయమనే సుస్పష్టమవుతోంది.

Also Read: కర్ణాటక మాజీ సీఎం ఎస్ ఎం కృష్ణ కన్నుమూత


స్పందించిన ఆర్ కృష్ణయ్య..

చట్టసభల్లో బీసీల రిజర్వేషన్ కోసం ప్రయత్నం చేస్తానని ఆర్ కృష్ణయ్య స్పష్టం చేశారు. మంగళవారం అమరావతిలో ఆర్ కృష్ణయ్య నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బీసీల ప్రయోజనాల కోసం ఎంత వరకు అయినా వెళ్తానని ఆయన పేర్కొన్నారు. బీసీలకు రిజర్వేషన్లు కల్పించడం బీజేపీతోనే సాధ్యమన్నారు. తాను ఏ పార్టీల వద్దకు వెళ్లడం లేదని.. పార్టీలే తన వద్దకు వస్తున్నాయని ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య తెలిపారు.

For AndhraPradesh News and Telugu News

Updated Date - Dec 10 , 2024 | 01:31 PM