కట్టడం కాదు... కూల్చడం!
ABN , Publish Date - Apr 21 , 2024 | 04:12 AM
శుభం పలకరా పెళ్లి కొడకా... అంటే ఇంకేదో అన్నాడట! అధికారంలోకి రాగానే ఎవరైనా మంచి పనితో పాలన మొదలుపెడతారు. కానీ...

శుభం పలకరా పెళ్లి కొడకా... అంటే ఇంకేదో అన్నాడట! అధికారంలోకి రాగానే ఎవరైనా మంచి పనితో పాలన మొదలుపెడతారు. కానీ... సీఎం జగన్ మాత్రం కూల్చివేతలతో మొదలుపెట్టారు. కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లు, అధికారులతో సమీక్షలు, సమావేశాల కోసం చంద్రబాబు సర్కారు ‘ప్రజావేదిక’ను నిర్మించింది. ముఖ్యమంత్రి నేరుగా ప్రజలను కలిసేందుకూ ఇదే వేదికగా మారింది. కానీ... సీఎంగా నిర్వహించిన తొలి కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లోనే ప్రజా వేదికపై జగన్ ‘అక్రమ కట్టడం’ అనే ముద్ర వేశారు. ‘మీకు తెలుసా... మనం అక్రమ కట్టడంలో కూర్చుని చర్చలు జరుపు తున్నాం. ఇక్కడ ఇదే ఆఖరి సమావేశం కావాలి. ఈ సమావేశం పూర్తి కాగానే దీనిని కూల్చి వేయండి’ అని 2019 జూన్ 24న జగన్ ఆదేశాలు జారీ చేశారు. రాత్రికి రాత్రే ప్రజావేదికను కూల్చివేశారు. జగన్ కూల్చిన మొదటి, ఆఖరి ‘అక్రమ’ కట్టడం అదొక్కటే. రూ.8 కోట్ల ప్రజాధనంతో వెచ్చించి నిర్మించిన ఆ కట్టడాన్ని తాను వాడుకోవడం ఇష్టంలేకుంటే... ఆస్పత్రిగా మార్చొచ్చు. హాస్టల్ భవనంలా ఉపయోగించవచ్చు. ఇంకేదైనా ప్రజోపయోగ పనులకోసం వాడుకోవచ్చు. కానీ... దానిని నేలమట్టం చేసేశారు. జగన్ హింసానందానికి ఇదో మచ్చు తునక!