Video Contest : వీడియోలు చేయండి.. రూ. 30వేలు గెలుకోండి

ABN, Publish Date - Jul 30 , 2024 | 07:52 AM

యూట్యూబర్లు, ఇంజనీరింగ్‌ విద్యార్థులు ఇలా ఎవరైనా ఈ క్యూఆర్‌ కోడ్లను స్కాన్‌ చేసుకుని వాటి వివరాలను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ముందుగా పేరు, వివరాలు రిజిస్టర్‌ చేసుకుని..

Video Contest : వీడియోలు చేయండి.. రూ. 30వేలు గెలుకోండి

  • చైతన్యవంత వీడియోలకు ఆహ్వానం

  • సైబర్‌ నేరాలు, మహిళా భద్రతపై వీడియోల పోటీలు

  • ఉత్తమ వీడియోలకు నగదు బహుమతి : సీపీ వెల్లడి

విజయవాడ/అమరావతి : సైబర్‌ నేరాలకు (Cyber Crime) లెక్కే లేదు..! టెక్నాలజీ అవసరాలు పెరుగుతున్న కొద్దీ సైబర్‌ నేరగాళ్లు కొత్త ఎత్తులతో ఖాతాదారుల సొమ్ములను కొల్లగొట్టేస్తున్నారు. మైనారిటీ తీరకుండా విద్యాసంస్థల్లో ప్రేమాయణం నడుపుతున్నారు. మైనారిటీ తీరని అమ్మాయి అంగీకరించిందని తీసుకెళ్లి లైంగికదాడి కేసుల్లో యువకులు ఇరుక్కుంటున్నారు.


చైతన్యం చేయండి!

సైబర్‌ నేరగాళ్ల వలలో చిక్కకుండా, మహిళలు, అమ్మాయిల భద్రతకు సంబంధించి అవగాహన కల్పించే విధంగా వీడియోల రూపకల్పన పోటీలను నిర్వహించాలని పోలీసు అధికారులు నిర్ణయించారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను సీపీ రాజశేఖరబాబు, డీసీపీలు గౌతమీశాలి, టి.హరికృష్ణ, మురళీకృష్ణ నాయుడు, ఏసీపీ స్రవంతిరాయ్‌, తేజేశ్వరరావులు సోమవారం ఆవిష్కరించారు. ఇందుకోసం రెండు క్యూఆర్‌ కోడ్‌ను విడుదల చేశారు.


NTR-District-Police.jpg

ఇలా చేయండి..

యూట్యూబర్లు, ఇంజనీరింగ్‌ విద్యార్థులు ఇలా ఎవరైనా ఈ క్యూఆర్‌ కోడ్లను స్కాన్‌ చేసుకుని వాటి వివరాలను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ముందుగా పేరు, వివరాలు రిజిస్టర్‌ చేసుకుని ఏ అంశంపై వీడియోను రూపొందిస్తారో స్పష్టం చేయాలి. ఇలా చేసిన వీడియోలను క్యూఆర్‌ కోడ్‌ చూపించిన లింక్‌ల్లో అప్‌లోడ్‌ చేయాలి. ఇలా వచ్చిన వీడియోలను అధికారులు ఎంపిక చేస్తారు. ఇందులో మొదటి బహుమతిగా రూ.30వేలు, ద్వితీయ బహుమతిగా రూ.20వేలు, తృతీయ బహుమతిగా రూ.10వేలు అందజేస్తారు.

Updated Date - Jul 30 , 2024 | 08:01 AM

Advertising
Advertising
<