ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Chandrababu: చంద్రబాబును కలిసేందుకు వైసీపీ ఖాకీలుగా పేరుతెచ్చుకున్న అధికారులు యత్నాలు

ABN, Publish Date - Jun 06 , 2024 | 11:18 AM

మర్యాద పూర్వక భేటీ పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబును కలిసేందుకు వైసీపీ ఖాకీలుగా పేరుతెచ్చుకున్న అధికారులు యత్నాలు సాగిస్తున్నారు. ఈ నెల 9వ తేదీన చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ తరుణంలో ఆయనను కలవాలని పలువురు అధికారులు యత్నిస్తున్నారు. వీరి ప్రయత్నాలకు మరో ఆలోచన, చర్చ లేకుండా టీడీపీ అధిష్టానం తిరస్కరిస్తోంది.

అమరావతి: మర్యాద పూర్వక భేటీ పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబును కలిసేందుకు వైసీపీ ఖాకీలుగా పేరుతెచ్చుకున్న అధికారులు యత్నాలు సాగిస్తున్నారు. ఈ నెల 9వ తేదీన చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ తరుణంలో ఆయనను కలవాలని పలువురు అధికారులు యత్నిస్తున్నారు. వీరి ప్రయత్నాలకు మరో ఆలోచన, చర్చ లేకుండా టీడీపీ అధిష్టానం తిరస్కరిస్తోంది. గేటు దగ్గర నుంచే ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులును సెక్యూరిటీ సిబ్బంది వెనక్కి పంపించేసింది. జగన్‌తో అంటకాగి.. కర్టసీ మీటింగ్ పేరుతో వచ్చే వారికి నిర్మొహమాటంగా టీడీపీ పెద్దలు నో చెబుతున్నారు.

ED: లోన్ తీసుకొని నిధుల మళ్లింపు


చంద్రబాబును కలిసేందుకు వైసీపీ ఖాకీగా పేరు తెచ్చుకున్న కొల్లి రఘురామిరెడ్డి సైతం ప్రయత్నం చేస్తున్నారు. కొల్లి రాఘురామిరెడ్డికి అన్ని శాఖల నుంచి తప్పిస్తూ డిజీ ఆఫీస్‌లో రిపోర్టు చేయాలని నిన్న ఆదేశాలు అందాయి. టీడీపీ అధినేత చంద్రబాబును కలిసేందుకు ఈ రోజు అపాయింట్మెంట్ కోసం కొల్లి ప్రయత్నం చేశారు. చంద్రబాబు మాత్రం సమస్యే లేదని తిరస్కరించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఆ పార్టీ నేతల అడుగులకు మడుగులు ఒత్తుతూ టీడీపీ నేతలను తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన వారిలో చాలా మంది అధికారులున్నారు. ఇప్పుడు వారందరికీ వెన్నులో వణుకు ప్రారంభమైంది.

Janasena : ప్రతి ఓటూ బాధ్యత గుర్తుచేసేదే

Read Andhra Pradesh News and Latest Telugu News

Updated Date - Jun 06 , 2024 | 11:18 AM

Advertising
Advertising