ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Pensions: ఇవాళా అదే పరిస్థితి.. ఏపీలో పెన్షన్‌దారుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు...

ABN, Publish Date - Apr 04 , 2024 | 11:56 AM

Andhrapradesh: ఏపీలో ఎక్కడ చూసినా.. ఎవరి నోట విన్నా పెన్షన్ల పంపిణీ అంశమే కనిపిస్తోంది.. వినిపిస్తోంది. పెన్షన్లపై వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటలు కూడా తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఇదిలా ఉండగా పెన్షన్ల కోసం ఎదురు చూసిన పెన్షన్ దారులు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిన్నటి నుంచి పెన్షన్ల పంపిణీ షురూ అయినప్పటికీ మొదటి రోజు ఎంతటి హంగామా జరిగిందో అందరికీ తెలిసిందే.

విజయవాడ, ఏప్రిల్ 4: ఏపీలో ఎక్కడ చూసినా.. ఎవరి నోట విన్నా పెన్షన్ల పంపిణీ (AP Pensions) అంశమే కనిపిస్తోంది.. వినిపిస్తోంది. పెన్షన్లపై వైసీపీ (YSRCP), టీడీపీ (TDP) నేతల మధ్య మాటలు కూడా తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఇదిలా ఉండగా పెన్షన్ల కోసం ఎదురు చూసిన పెన్షన్ దారులు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిన్నటి నుంచి పెన్షన్ల పంపిణీ షురూ అయినప్పటికీ మొదటి రోజు ఎంతటి హంగామా జరిగిందో అందరికీ తెలిసిందే. పెన్షన్ల కోసం ఉదయం నుంచి వృద్ధులు, వితంతువులు సచివాలయాల వద్ద క్యూలైన్లలో పడిగాపులు పడాల్సి వచ్చింది. అయితే డబ్బులు అందలేదని, ఉదయం నుంచి కాదు మధ్యాహ్నం నుంచి పెన్షన్ పంపిణీ అంటూ ఇలా పలు రకాల ప్రకటనలతో పెన్షన్ దారులు ఇబ్బందులు పడ్డారు. చివరకు నిన్నటి సాయంత్రం నుంచి పెన్షన్ల పంపిణీ మొదలవడంతో పెన్షన్‌దారులు ఊపిరిపీల్చుకున్నారు.

AP News: ఎన్నికల్లో మీకు ఎలా కావాలంటే ఆ విధంగా పనిచేస్తా..


వృద్ధుల వేడుకోలు....

అయితే ఈరోజు (గురువారం) కూడా వృద్ధులు పెన్షన్ల కోసం పాట్లు పడాల్సి వస్తోంది. అనారోగ్యంతో ఉన్నవారు, వికలాంగులకు ఇళ్ల వద్దే పెన్షన్ ఇవ్వాలన్న ఎన్నికల సంఘం, సీఎస్ ఆదేశాలు ఎక్కడా అమలు కాని పరిస్థితి ఏర్పడింది. నిన్న సాయంత్రం నుంచి పెన్షన్‌ల పంపిణీ ప్రారంభం అవగా.. ఈరోజు ఉదయం పది గంటలకే నగదు అయిపోయిందని సిబ్బంది చెబుతున్నారు. మళ్లీ బ్యాంకుల్లో తేవాలని చెబుతూ సచివాలయ సిబ్బంది.. వృద్దులను వెనక్కి పంపుతున్నారు. నడవలేని వారి ఇళ్లకు వెళ్లి ఇవ్వాలని ఆదేశించినా అధికారులు పట్టించుకోకపోవడం విమర్శలు తావిస్తోంది. చివరకు సహాయకుల ద్వారా కష్ట పడి వస్తే పెన్షన్ ఇవ్వకుండా వెనక్కి పంపుతున్నారంటూ పెన్షన్‌దారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ రాజకీయాలకు తమను బలి చేయవద్దని వృద్ధులు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి...

Lok Sabha Polls: బీజేపీ మేనిఫెస్టో లీక్.. కొత్త పథకాలు ఇవే..

Cheetah: అర్ధరాత్రి చిరుత పరుగులు.. సీసీ కెమెరాల్లో నమోదు


మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Apr 04 , 2024 | 12:00 PM

Advertising
Advertising