Share News

అమరావతికి ఔటర్‌, ఇన్నర్‌ రింగ్‌రోడ్లు

ABN , Publish Date - Jul 03 , 2024 | 04:44 AM

రాజధాని అమరావతికి ఔటర్‌, ఇన్నర్‌ రింగ్‌రోడ్లు నిర్మించాలని చంద్రబాబు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది ఈ రెండింటినీ పూర్తిగా కేంద్ర నిధులతోనే చేపట్టాలనుకుంటోంది.

అమరావతికి ఔటర్‌, ఇన్నర్‌ రింగ్‌రోడ్లు

కేంద్రానికి చంద్రబాబు ప్రతిపాదనలు... గడ్కరీని కోరనున్న సీఎం

అమరావతి, జూలై 2(ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతికి ఔటర్‌, ఇన్నర్‌ రింగ్‌రోడ్లు నిర్మించాలని చంద్రబాబు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది ఈ రెండింటినీ పూర్తిగా కేంద్ర నిధులతోనే చేపట్టాలనుకుంటోంది. సంబంధిత ప్రాజెక్టులను ఆమోదించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర ప్రభుత్వ పెద్దలను కోరనున్నారు. గురు, శుక్రవారాల్లో ఆయన ఢిల్లీలో పర్యటించనున్న సంగతి తెలిసిందే. అక్కడ కేంద్రరహదారుల మంత్రి నితిన్‌ గడ్కరీని కలిసి ఈ ప్రతిపాదనలు అందిస్తారు. మంగళవారం సాయంత్రం సచివాలయంలో ఇదే అంశంపై రోడ్లు భవనాల మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి, జాతీయ రహదారుల చీఫ్‌ ఇంజనీర్‌ రామచంద్ర, ఇతర శాఖల అధికారులతో ఆయన చర్చించారు. బుధవారం కూడా చర్చ జరిగే అవకాశముంది.

Updated Date - Jul 03 , 2024 | 07:52 AM

News Hub