Pawan Kalyan: పవన్ కల్యాణ్‌కు తీవ్ర జ్వరం.. తెనాలి పర్యటన రద్దు
ABN, Publish Date - Apr 03 , 2024 | 01:13 PM
నేడు తెనాలిలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటన రద్దు అయ్యింది. పవన్ జ్వరంతో బాధపడుతున్నారు. ఈరోజు సాయంత్రం తెనాలిలో ర్యాలీ, సభల్లో ఆయన పాల్గొనాల్సి ఉంది. నిన్న ఇరవై కిలోమీటర్లు ఎండలో పవన్ పాదయాత్ర చేశారు. ఎండ వేడిమికి అస్వస్థతకు గురయ్యారు. ఇంకా పూర్తిగా జ్వరం తగ్గక పోవడంతో తెనాలి పర్యటనను పవన్ రద్దు చేసుకున్నారు.
అమరావతి: తెనాలిలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పర్యటన నేడు రద్దు అయ్యింది. పవన్ జ్వరంతో బాధపడుతున్నారు. ఈరోజు సాయంత్రం తెనాలిలో ర్యాలీ, సభల్లో ఆయన పాల్గొనాల్సి ఉంది. నిన్న ఇరవై కిలోమీటర్లు ఎండలో పవన్ పాదయాత్ర చేశారు. ఎండ వేడిమికి అస్వస్థతకు గురయ్యారు. ఇంకా పూర్తిగా జ్వరం తగ్గక పోవడంతో తెనాలి పర్యటనను పవన్ రద్దు చేసుకున్నారు. మళ్లీ తేదీ, సమయం ప్రకటిస్తామని జనసేన నేతలు తెలిపారు.
AP High Court: ఎన్నికలకు ముందుకు ఏపీ సర్కారుకు హైకోర్టులో ఊహించని షాక్
ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. అయినా లెక్క చేయకుండా పవన్ వారాహి విజయ భేరి యాత్ర నిర్వహిస్తున్నారు. మంగళవారం నాడు ఆయన మండుటెండలో ఏకంగా 20 కిలో మీటర్ల పాటు పాదయాత్ర నిర్వహించారు. దీంతో ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర జ్వరంతో ఇబ్బంది పడుతున్నారు. ఆయనకు విశ్రాంతి అవసరమని వైద్యులు చెప్పడంతో నేటి తెనాలి పర్యటనను పవన్ రద్దు చేసుకున్నారు. జ్వరం తగ్గిన వెంటనే తిరిగి పర్యటన కొనసాగించనున్నారు. నాలుగు రోజుల క్రితమే అంటే పిఠాపురం నియోజకవర్గంలో పర్యటిస్తున్న సమయంలోనే పవన్ అస్వస్థతకు గురయ్యారని తెలుస్తోంది. అయినా లెక్కచేయక పర్యటనను కొనసాగించారు. ఇక ప్రస్తుతం ఆయన తీవ్ర జ్వరంతో బాధపడుతుండటంతో వైద్యుల సూచన మేరకు తన పర్యటనను రద్దు చేసుకున్నారు.
AP Pensions: మధ్యాహ్నం 3 గంటల నుంచి పెన్షన్ల పంపిణీ: చిత్తూరు కలెక్టర్
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...
Updated Date - Apr 03 , 2024 | 01:40 PM