ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Elections: వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థికి చేదు అనుభవం

ABN, Publish Date - May 09 , 2024 | 09:46 PM

ఎన్నికల ప్రచార నిమిత్తం గ్రామాల్లోకి అడుగుపెడుతున్న వైసీపీ అభ్యర్థులకు అడుగడుగున నిరసన సెగలు తగులుతున్నాయి. పల్లెల్లో ఎక్కడికక్కడ వారిని నిలదీస్తున్నారు. తాజాగా, వైసీపీ పెందుర్తి ఎమ్మెల్యే అభ్యర్థి అదీప్‌రాజుకు చేదు అనుభవం ఎదురైంది.

విశాఖ: ఎన్నికల ప్రచార నిమిత్తం గ్రామాల్లోకి అడుగుపెడుతున్న వైసీపీ అభ్యర్థులకు అడుగడుగున నిరసన సెగలు తగులుతున్నాయి. పల్లెల్లో ఎక్కడికక్కడ వారిని నిలదీస్తున్నారు. తాజాగా, వైసీపీ పెందుర్తి ఎమ్మెల్యే అభ్యర్థి అదీప్‌రాజుకు చేదు అనుభవం ఎదురైంది. పెందుర్తి మండల పరిధి చింతలగ్రహారంలో అదీప్ రాజు గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అయితే స్థానికులు వారిని అడ్డుకున్నారు. తమ సమస్యలు పరిష్కరించకుండా ఓట్లు అడగొద్దంటూ హెచ్చరించారు.


ఈ సందర్భంగా వారు అదీప్‌రాజు గతంలో ఇచ్చిన హామీలను గుర్తు చేశారు. పంచగ్రామాల భూసమస్య పరిష్కరిస్తామని చెప్పి మాటతప్పారని, ఇప్పుడేమో ఏమీ ఎరుగనట్లు మళ్లీ ఎన్నికల ప్రచారానికి వచ్చారంటూ మండిపడ్డారు. తమ సమస్యను పరిష్కరించని మీకు ఓట్లు వేయమంటూ అదీప్‌రాజు సమక్షంలోనే ఖరాఖండీగా చెప్పేశారు. తమ ఓట్లన్నీ కూటమి అభ్యర్థికే వేస్తామంటూ గ్రామస్తులు తేల్చిచెప్పారు.

Updated Date - May 09 , 2024 | 09:46 PM

Advertising
Advertising