ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Minister Dola: ఏపీ మంత్రి డోలాకు తృటిలో తప్పిన పెను ప్రమాదం..

ABN, Publish Date - Jul 28 , 2024 | 08:30 PM

ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి(Dola Sree Bala Veeranjaneya Swamy)కి ప్రమాదం తృటిలో తప్పింది. జరుగుమల్లి మండలం పాలేటిపాడు (Paletipadu)లో పోలేరమ్మ తిరుణాళ్ల కార్యక్రమంలో పాల్గొనేందుకు మంత్రి డోలా వెళ్లారు.

Minister Dola Sree Bala Veeranjaneya Swamy

ప్రకాశం: ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి (Dola Sree Bala Veeranjaneya Swamy)కి ప్రమాదం తృటిలో తప్పింది. జరుగుమల్లి మండలం పాలేటిపాడు(Paletipadu)లో పోలేరమ్మ తిరుణాళ్ల కార్యక్రమంలో పాల్గొనేందుకు మంత్రి డోలా వెళ్లారు. తిరునాళ్ల సందర్భంగా కొనుగోలు చేసిన నూతన ఎడ్లబండిని ప్రారంభించాలని టీడీపీ నాయకులు ఆయణ్ని కోరారు. వారి కోరిక మేరకు ఆయన ఎడ్లబండి ఎక్కారు. కాస్త ముందుకు కదలగానే డీజే ఆపరేటర్లు పెద్దఎత్తున సౌండ్లు పెట్టారు.


దీంతో బెదిరిపోయిన ఎద్దులు బండిని లాక్కొని ముందుకు వెళ్లాయి. ఆ సమయంలో తూలినపోయిన మంత్రి డోలా ఒక్కసారిగా కిందపడిపోయారు. ఆయనకు స్వల్పగాయాలు కావడంతో అప్రమత్తమైన స్థానిక నాయకులు మంత్రిని అక్కడ్నుంచి తప్పించారు. మంత్రికి పెద్ద ప్రమాదం తప్పడంతో అక్కడున్న భక్తులు, టీడీపీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం మంత్రి డోలా యధావిధిగా పోలేరమ్మ తిరునాళ్ల పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కార్యక్రమం ముగిశాక స్వగ్రామం నాయుడుపాలెంకు మంత్రి వెళ్లిపోయారు.

ఇవి కూడా చదవండి:

Paris Olympics 2024: యువ షూటర్ మనుభాకర్‌కు ఏపీ నుంచి ప్రశంసల వెల్లువ..

AP News: టెట్ దరఖాస్తు గడువుపై ఏపీ సర్కార్ క్లారిటీ..

Minister Ravi Kumar: లైన్‌మెన్ రామయ్య సాహనం ప్రశంసనీయం: మంత్రి గొట్టిపాటి

Updated Date - Jul 28 , 2024 | 08:51 PM

Advertising
Advertising
<