Minister Dola: జగన్ చికిత్స చేయించుకుంటే మంచిది: మంత్రి డోలా
ABN, Publish Date - Jul 21 , 2024 | 09:25 PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే మహిళలందరికీ ఆర్టీసీ(RTC)లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి(Minister Dola Veeranjaneya Swamy) తెలిపారు. ఉచిత ప్రయాణంపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోందని మంత్రి చెప్పారు. ఒంగోలు బస్టాండ్‌లో ఐదు నూతన బస్ సర్వీసులను మంత్రి డోలా ప్రారంభించారు.
ప్రకాశం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే మహిళలందరికీ ఆర్టీసీ(RTC)లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి(Minister Dola Veeranjaneya Swamy) తెలిపారు. ఉచిత ప్రయాణంపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోందని మంత్రి చెప్పారు. ఒంగోలు బస్టాండ్‌లో ఐదు నూతన బస్ సర్వీసులను మంత్రి డోలా ప్రారంభించారు. ఏపీ ప్రభుత్వం ప్రయాణికుల భద్రతపై దృష్టి సారించిందని, అందుకు అనుగుణంగా ఆర్టీసీలో 25శాతం బస్సులను రీప్లేస్ చేయటం జరిగిందని వెల్లడించారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను కూడా త్వరలోనే పరిష్కరిస్తామని మంత్రి డోలా హమీ ఇచ్చారు.
ఈ సందర్భంగా మంత్రి వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ.."మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పదవి లేదన్న నిరుత్సాహంలో ఉన్నారు. ఆయనకు ఇంకా మానసిక సమస్యలు పోలేదు. దాని కోసం బెంగళూరులో జగన్ చికిత్స చేయించుకుంటే మంచిది. తీవ్రమైన పదవీ వ్యామోహం, పదవీకాంక్షలో ఆయన ఉన్నారు. ఏపీలో నాలుగు రాజకీయ హత్యలు జరిగితే అందులో ముగ్గురు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే ఉన్నారు. వాళ్లందరి దగ్గరికీ జగన్ వెళ్లి పరామర్శించి ఉంటే బాగుండేది.
వైసీపీ అధినేతకి శవ రాజకీయాలు అలవాటే. వైఎస్ రాజశేఖర్ రెడ్డి శవాన్ని అడ్డుపెట్టుకుని ముఖ్యమంత్రి పదవి కోసం సంతకాలు సేకరించారు. ఓదార్పు యాత్ర పేరుతో రాష్ట్రం మెుత్తం తిరిగారు. శవ రాజకీయాల్లో జగన్ ఆద్యుడు. ఆయనకు సాటి మరెవ్వరూ రాలేరు. ఏపీలో మేము కేవలం ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకే ఉన్నాము. ఏ విషయంలోనూ మాజీ ముఖ్యమంత్రి జగన్‌కి కనీసం ఓపిక లేకుండా పోయింది" అని అన్నారు.
Updated Date - Jul 21 , 2024 | 09:52 PM