Share News

వైసీపీకి షాక్‌

ABN , Publish Date - Feb 15 , 2024 | 11:07 PM

సీనియర్‌ నాయకులు, మాజీ ఎమ్మెల్యే డాక్టరు బాచిన చెంచుగరటయ్య, ఆయన కుమారుడు శాప్‌నెట్‌ చైర్మన్‌ కృష్ణచైతన్యలు గురువారం రాత్రి టీడీపీ అధినేత చంద్రబాబును కలిశారు. వైసీపీ అధినేత, సీఎం జగన్‌ తమను మోసం చేశాడని తీవ్ర అసంతృప్తితో ఉన్న వారు టీడీపీ అధినేతను కలవటం విశేషం. గురువారం సాయంత్రం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో కలిసి వెళ్లి వారు భేటీ అయ్యారు. గతం నుంచి ఉన్న పరిచయంతో చంద్రబాబు వారిని సాదరంగా ఆహ్వానించారు.

వైసీపీకి షాక్‌
బాబుకు పుష్పగుచ్చం అందజేస్తున్నచైతన్య, పక్కన గరటయ్య

బాబును కలిసిన గరటయ్య, చైతన్య

దర్శి నుంచి పోటీకి అవకాశం ఇవ్వాలని అడిగిన చైతన్య

కష్టపడి పనిచేసినా వైసీపీ మోసం చేసిందని ఆవేదన

మంచి జరుగుతుంది ధైర్యంగా ఉండండి: చంద్రబాబు

(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)

సీనియర్‌ నాయకులు, మాజీ ఎమ్మెల్యే డాక్టరు బాచిన చెంచుగరటయ్య, ఆయన కుమారుడు శాప్‌నెట్‌ చైర్మన్‌ కృష్ణచైతన్యలు గురువారం రాత్రి టీడీపీ అధినేత చంద్రబాబును కలిశారు. వైసీపీ అధినేత, సీఎం జగన్‌ తమను మోసం చేశాడని తీవ్ర అసంతృప్తితో ఉన్న వారు టీడీపీ అధినేతను కలవటం విశేషం. గురువారం సాయంత్రం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో కలిసి వెళ్లి వారు భేటీ అయ్యారు. గతం నుంచి ఉన్న పరిచయంతో చంద్రబాబు వారిని సాదరంగా ఆహ్వానించారు. ఆ వెంటనే గరటయ్య వైసీపీలో చాలా కష్టపడి పనిచేశామని, నాలుగున్నరేళ్లుగా తన కుమారుడు చైతన్య నియోజకవర్గంలో విస్తృతంగా తిరుగుతూ పార్టీ కోసం, ప్రజల కోసం పనిచేయగా చివరికి జగన్‌ మోసం చేశాడని వాపోయినట్లు తెలిసింది. కష్టపడిన వారిని కాదు పొమ్మన్నారని చెప్పి చైతన్యను పరిచయం చేశారు. మీరు అవకాశం ఇస్తే పార్టీలో చేరి దర్శి నుంచి పోటీ చేయటానికి సిద్ధంగా ఉన్నామని చెప్పినట్లు సమాచారం. చంద్రబాబు కూడా సానుకూలంగా స్పందించి మీకు వైసీపీలో జరిగిన మోసం తెలిసింది, టీడీపీలో చేరాలని చెప్పినట్లు తెలిసింది. చైతన్యకు న్యాయం జరుగుతుందని అభయమిచ్చి జనసేనతో పొత్తును ప్రస్తావిస్తూ దర్శిని జనసేనకు కేటాయించే అవకాశం ఉందని, అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకుని సహకారం అందిస్తానని చెప్పినట్లు సమాచారం. ప్రజాసేవ చేయాలంటే టీడీపీ, జనసేన కూటమి వల్లే సాధ్యమని, మీరు ఈ కూటమిలోకి రావాలని కోరినట్లుగా చెబుతున్నారు. ఆ తర్వాత వారు ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ను కూడా కలిసి మాట్లాడినట్లు సమాచారం. తొలుత నియోజకవర్గంలోని సంతమాగులూరు మండలానికి చెందిన వైసీపీ రాష్ట్ర నాయకుడు అట్ల చినవెంకటరెడ్డి ఆధ్వర్యంలో ఎంపీటీసీలు, సర్పంచ్‌లు పార్టీలో చేరగా వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. తర్వాత తన గదిలో అచ్చెన్నాయుడు సమక్షంలో గరటయ్య, చైతన్యలతో చంద్రబాబు చర్చించారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు వారి గురించి చెప్పబోగా తనకు సుపరిచితులేనని బాబు చెప్పినట్లు తెలిసింది. అయితే కూటమిలో ఏపక్షం నుంచి వీరు తెరపైకి రానున్నారనేది చర్చనీయాంశమైంది. కాగా గరటయ్య, చైతన్యలను వైసీపీ అధిష్ఠానం సస్పెండ్‌ చేసింది. బాబును కలిసిన కొద్దిసేపటికే ఆ పార్టీ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

Updated Date - Feb 15 , 2024 | 11:07 PM