ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kakinada Port Case : అరబిందో శరత్‌చంద్రారెడ్డికి సీఐడీ తాఖీదు

ABN, Publish Date - Dec 22 , 2024 | 03:37 AM

కాకినాడ సీపోర్టులో వ్యాపారవేత్త కేవీ రావును బెదిరించి అన్యాయంగా వాటాలను రాయించుకున్న కేసు దర్యాప్తులో సీఐడీ వేగం పెంచింది.

  • 24 తర్వాత వస్తానన్న డైరెక్టర్‌ శరత్‌

  • ఆడిట్‌ సంస్థ పీకేఎఫ్‌ ప్రతినిధుల విచారణ

  • మరో ఇద్దరు డైరెక్టర్లకూ నోటీసులు

  • వాటాలు వదులుకునేలా కేవీరావుపై నాడు ఒత్తిడి

  • అందులో కీలక పాత్ర పీకేఎఫ్‌దే

  • కేవీరావు 924 కోట్లు చెల్లించాలని ఆ సంస్థ నివేదిక

  • దాంతో వైసీపీ పెద్దల వేధింపులు

  • ‘సెటిల్మెంట్‌’ తర్వాత రూ.9 కోట్లుగా మార్చిన వైనం

కాకినాడ సీపోర్టులో వ్యాపారవేత్త కేవీ రావును బెదిరించి అన్యాయంగా వాటాలను రాయించుకున్న కేసు దర్యాప్తులో సీఐడీ వేగం పెంచింది. జగన్‌ హయాంలో వివాదాస్పదంగా మారిన ఈ వ్యవహారంలో బెదిరించి కేవీరావుతో వాటాలు రాయించుకోవడంలో కీలకంగా వ్యవహరించినవారికి తాఖీదులు జారీ చేస్తోంది. విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేస్తోంది. కాకినాడ పోర్టు, సెజ్‌ను ఆనాడు బెదిరించి లాగేసుకున్నారని యజమాని కేవీ రావు ఇచ్చిన ఫిర్యాదుపై సీఐడీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్‌ రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి, అరబిందో ఫార్మాకు చెందిన శరత్‌ చంద్రారెడ్డి, చెన్నైకు చెందిన ఆడిటింగ్‌ కంపెనీ పీకేఎఫ్‌ ప్రతినిధులు సుందర్‌, విశ్వనాథ్‌, ప్రసన్నకుమార్‌, అపర్ణలను నిందితులుగా చేర్చారు. సెజ్‌ను లాక్కున్న అరబిందో ఇన్‌ఫ్రాను కేసులో చేర్చారు. ఈ క్రమంలో కాకినాడ పోర్టుకు ఆడిట్‌ నివేదికను రూపొందించిన పీకేఎఫ్‌ సంస్థ ప్రతినిధులు సుందర్‌, విశ్వనాఽథ్‌ను సీఐడీ విజయవాడ ప్రాంతీయ కార్యాలయంలో శనివారం విచారించారు. ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి వరకు విచారణ సాగుతూనే ఉంది. విచారణలో అధికారులు అడిగిన ప్రశ్నలకు ఆడిటింగ్‌ కంపెనీ ఉద్యోగులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. పీకేఎ్‌ఫకు డైరెక్టర్లుగా ఉన్న ప్రసన్నకుమార్‌, అపర్ణకు కూడా నోటీసులు ఇవ్వడానికి సీఐడీ అధికారులు సిద్ధమయ్యారు.


ఈనెల 24వ తేదీ తర్వాత వారిని విచారణకు పిలిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేవీ రావు నుంచి కాకినాడ సీపోర్టును లాక్కోవడంలో ప్రధానంగా అభియోగాలు ఎదుర్కొంటున్న అరబిందో ఫార్మా ప్రతినిధి పెనకా శరత్‌చంద్రారెడ్డికి సీఐడీ అధికారులు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరుకావాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. తాను అయ్యప్పస్వామి మాలలో ఉన్నందున ఈ నెల 24 తర్వాత విచారణకు వస్తానని శరత్‌చంద్రారెడ్డి సీఐడీకి లేఖ రాశారు. కాకినాడ సీ పోర్టుపై చెన్నైకి చెందిన పీకేఎఫ్‌ కన్సల్టెన్సీతో ఆనాడు ఆడిట్‌ చేయించారు. దీనివెనుక కుట్ర కోణం ఉన్నదని సీఐడీ అనుమానిస్తోంది. కాకినాడ సిటీ ఎమ్మెల్యేగా ఉన్న ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డికి పీకేఎఫ్‌ కంపెనీతో సత్సంబంధాలు ఉన్నాయి.

Updated Date - Dec 22 , 2024 | 03:38 AM