AP Politics: బీసీ నేతపై వివక్ష.. ఓసీ ఎమ్మెల్యేకు మాత్రం సెల్యూట్.. ఎక్కడంటే..?
ABN, Publish Date - Feb 21 , 2024 | 05:36 PM
బీసీ నేత గంజి చిరంజీవి వివక్షకు గురయ్యారు. సెక్యూరిటీ సిబ్బంది చిరంజీవిని ఆపి మరి తనిఖీ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయగా తెగ వైరల్ అవుతోంది.
అమరావతి: బీసీ రాజకీయ నేతకు తప్పని వివక్ష..? ఆపి మరి తనిఖీ చేసిన సెక్యూరిటీ సిబ్బంది..? అవమానానికి గురయిన బీసీ నేత గంజి చిరంజీవి (Chiranjeevi). అంతకుముందు ఎలాంటి చెకింగ్ లేకుండా వెళ్లిపోయిన ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి. ఆ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది. రాజకీయాల్లో కూడా వివక్ష తగునా..? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యేకో న్యాయం..? బీసీ నేతకు మరో న్యాయమా..? అని నిలదీస్తున్నారు.
వీడియో వైరల్
తెల్లారి లేచించి మొదలు సామాజిక న్యాయం గురించి మాట్లాడుతుంటారు ఏపీ సీఎం, వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్.. బహిరంగ సభలు, సమావేశాల్లోనైతే ‘నా ఎస్సీ.. నా ఎస్టీ.. నా బీసీ సోదరులు’ అంటూ తెగ ప్రేమ ఒలకబోస్తుంటారు. ‘మీ బిడ్డను. మీ ముఖాల్లో చిక్కని చిరునవ్వు చూడడమే నా ధ్వేయం’’ అని చెబుతుంటారు. కానీ ఆచరణలో ఆయన చిత్తశుద్ధి ఏపాటిదో ఐదేళ్ల పాలనను గమనిస్తే ఇట్టే అర్థమైపోతుంది. ఏ పదవుల్లో చూసినా ఆయన సామాజికవర్గం వారే ఉంటారని బహిరంగ రహస్యమే. రాష్ట్ర ప్రజల సంగతి పక్కన పెడితే కనీసం వైసీపీలో అంతర్గతంగానైనా ఏ కోశానా సామాజిక న్యాయం అనే మాటే కనిపించదు. వినిపించదు. ఇందుకు అద్దంపట్టే ఘటన మరోటి చోటుచేసుకుందంటూ సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో వైరల్‌గా మారింది.
సిబ్బంది తీరు సరికాదు..?
ఆ వీడియో ఫేస్‌బుక్‌లో తెగ చక్కర్లు కొడుతోంది. బీసీ పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన గంజి చిరంజీవి (Chiranjeevi) పట్ల సెక్యూరిటీ సిబ్బంది ప్రవర్తనను నెటిజన్లు ఖండిస్తున్నారు. ఆ వీడియోలో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజసంగా వెళుతున్నారు. ఆయనను సిబ్బంది ఆపలేదు. సెల్యూట్ చేసి లోపలికి పంపించారు. ఆళ్ల రామకృష్ణా రెడ్డి స్థాయి అయిన చిరంజీవి మాత్రం వెయిట్ చేయాల్సి వచ్చింది. ఆయనను తనిఖీ చేయడాన్ని బీసీ సామాజిక వర్గ నేతలు తప్పు పడుతున్నారు.
ఇతర చోట్ల కూడా..?
ఇక్కడే కాదు ఇతర చోట్ల బీసీలకు, బీసీ నేతలకు ఇలాంటి అవమానాలు జరుగుతాయని వారు చెబుతున్నారు. పైకి మాత్రం బీసీలు, బడుగు, బలహీన వర్గాల వారిని సమానంగా చూస్తాం అని అంటారు. అందరూ సమానమేనని, సామాజిక న్యాయం వర్తిస్తుందని చెబుతారు. వాస్తవం మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. గంజి చిరంజీవి ఘటన అందుకు ఉదహరణగా నిలుస్తోంది. అనధికార పర్యటనలో బీసీ నేతను కావాలనే అవమానించారు. సెక్యూరిటీ సిబ్బంది చేత వివక్షకు గురిచేశారని బీసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇంచార్జీ మార్పు
గంజి చిరంజీవి ప్రస్తుతం వైసీపీలో ఉన్నారు. మంగళగిరి వైసీపీ ఇంఛార్జీగా నియమించారు. దాంతో సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి పార్టీని వీడారు. వైఎస్ షర్మిల నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ వెంటనే ఆళ్ల రామకృష్ణా రెడ్డి తిరిగి వైసీపీలోకి వచ్చారు. తర్వాత మంగళగిరి వైసీపీ నియోజకవర్గ ఇంఛార్జీని మార్చారు. చిరంజీవి స్థానంలో కాండ్రు కమలను ఇంచార్జీగా నియమించారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
Updated Date - Feb 21 , 2024 | 06:02 PM