బిల్డర్ మధు హత్య వెనుక ప్రేమ కథ..!
ABN , Publish Date - May 28 , 2024 | 11:43 AM
కేసినో కింగ్.. బిల్డర్ మధు హత్య కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. బిల్డర్ మధుకు 200 కోట్ల ఆస్తి ఉంది. ఆయన చికోటి ప్రవీణ్ అనుచరుడు. మధును చంపింది ఆయన స్నేహితులేనన్న విషయం తెలిసిందే. నిందితులు కల్పన సొసైటీలో ఉంటున్నారు. రేణుకా ప్రసాద్, లిఖిత్ సిద్ధార్థ్‌రెడ్డి వరుణ్‌తో మధుకు స్నేహం ఉంది.
హైదరాబాద్: కేసినో కింగ్.. బిల్డర్ మధు హత్య కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఆయన హత్య వెనుక ఓ ప్రేమ కథ ఉంది. బిల్డర్ మధుకు 200 కోట్ల ఆస్తి ఉంది. ఆయన చికోటి ప్రవీణ్ అనుచరుడు. మధును చంపింది ఆయన స్నేహితులేనన్న విషయం తెలిసిందే. నిందితులు కల్పన సొసైటీలో ఉంటున్నారు. రేణుకా ప్రసాద్, లిఖిత్ సిద్ధార్థ్‌రెడ్డి వరుణ్‌తో మధుకు స్నేహం ఉంది. కేసినో ఆట కారణంగా మధుకు, రేణుకా ప్రసాద్ గ్యాంగ్‌తో స్నేహం ఏర్పడింది. కేసినో ఆడుదామని తీసుకునివెళ్లి మధుని మందు బాటిళ్లతో పొడిచి దారుణంగా హత్య చేశారు. మధుకు ఇద్దరు ఆడపిల్లలున్నారు. ఆయనకు నవరాత్రులు ఘనంగా నిర్వహించే అలవాటు ఉంది.
NTR Jayanthi: ఎన్టీఆర్ ఘాట్‌కు పోటెత్తిన ప్రముఖులు..
నవరాత్రుల టైంలో మధు చిన్న కూతురు పూజలో పాల్గొంది. ఆ సమయంలో మధు చిన్న కూతురిని చూసిన రేణుకా ప్రసాద్ ఆమెపై కన్నేసి ప్రేమలోకి దింపాడు. మధుకు తమ ప్రేమ విషయం చెప్పి... కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయమని కోరాడు. రేణుకా ప్రసాద్‌తో కూతురు పెళ్లికి మధు అంగీకరించలేదు. పెళ్లికి ఒప్పుకోకపోవడంతో రేణుకా ప్రసాద్ కక్ష పెంచుకున్నాడు. ఈ మధ్యే చిన్నకూతురికి పెళ్లి సంబంధాన్ని సైతం మధు కుదిర్చాడు. ప్రేమను దూరం చేసిన మధును చంపడానికి రేణుకా ప్రసాద్ స్కెచ్ వేశాడు. ముందుగా హైదరాబాద్‌లోనే హత్యకు ప్రణాళిక వేశాడు. సుపారీ గ్యాంగ్‌ను నెల రోజుల పాటు హైదరాబాద్‌లో ఉంచాడు. హైదరాబాద్‌లో హత్యకు పరిస్థితులు అనుకూలించకపోవడంతో.. కేసినో ఆడుదామని బీదర్‌కు తీసుకెళ్లి మధును రేణుకా ప్రసాద్ దారుణంగా హత్య చేశాడు.
Raghurama: ఆ రోజు నా జీవితంలో మధురమైన క్షణాలు: రఘురామ