ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Politics: ఎలక్టోరల్ బాండ్లపై మోదీ సర్కార్‌కు షర్మిల సవాల్

ABN, Publish Date - Mar 07 , 2024 | 06:36 PM

లక్టోరల్ బాండ్లతో అక్రమంగా సంపాదించుకోవాలని బీజేపీ (BJP) చూస్తోందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) అన్నారు. గురువారం నాడు ఎలక్టోరల్ బాండ్లపై సుప్రీం కోర్టు ఉత్తర్వులు ఉన్నా.. కేంద్రం చర్యలు తీసుకోవడం లేదని ఏపీ కాంగ్రెస్ నేతలు నిరసనలకు పిలుపునిచ్చారు. ఎస్బీఐ ఎదుట షర్మిలతో పాటు జేడీ శీలం, పల్లంరాజు, గిడుగు రుద్రరాజు, సుంకర పద్మశ్రీ, నరహరిశెట్టి నరసింహారావు నిరసన చేపట్టారు.

YS Sharmila

విజయవాడ: ఎలక్టోరల్ బాండ్లతో అక్రమంగా సంపాదించుకోవాలని బీజేపీ (BJP) చూస్తోందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) అన్నారు. గురువారం నాడు ఎలక్టోరల్ బాండ్లపై సుప్రీం కోర్టు ఉత్తర్వులు ఉన్నా.. కేంద్రం చర్యలు తీసుకోవడం లేదని ఏపీ కాంగ్రెస్ నేతలు నిరసనలకు పిలుపునిచ్చారు. ఎస్బీఐ ఎదుట షర్మిలతో పాటు జేడీ శీలం, పల్లంరాజు, గిడుగు రుద్రరాజు, సుంకర పద్మశ్రీ, నరహరిశెట్టి నరసింహారావు నిరసన చేపట్టారు. ‘మోదీ కనుసన్నల్లో ఎస్బీఐ’ అని రాసిన ఫ్లకార్డులను ప్రదర్శించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ... ఎస్బీఐ మోదీ బ్యాంకా... ప్రజల బ్యాంకా అని ప్రశ్నించారు. అన్ని ప్రాంతీయ పార్టీలు దమ్ముంటే వారి ఎలక్టోరల్ బాండ్ల వివరాలు బయటపెట్టాలని షర్మిల సవాల్ విసిరారు.

ఎలక్టోరల్ బాండ్లు ఏఏ కంపెనీలకు ఎంతెంత ఇచ్చాయో బయటపెట్టాలని సుప్రీంకోర్టు ఆదేశించిందని చెప్పారు. ఏ కంపెనీ అయిన పొలిటికల్ పార్టీకి డబ్బు ఇస్తుందని.. కానీ ఆ వివరాలను కేంద్రం గోప్యంగా ఉంచాలని అక్రమమని ఆందోళన వ్యక్తం చేశారు. ఈడీ, సీబీఐ, ఇన్‌కంట్యాక్స్‌లను ప్రయోగించి కేంద్రప్రభుత్వం బెదిరిస్తుందని మండిపడ్డారు. మోదీ ప్రభుత్వరంగ సంస్థలను ఎలా వాడుకుంటున్నారనేదానికి ఇది నిదర్శనమని చెప్పారు. ఎలక్టోరల్ బాండ్ల వివరాలను తెలపాలని డిమాండ్ చేశారు. SBI వివరాలు బయటపెడితే మోదీ, జగన్, కేసీఆర్, చంద్రబాబు పార్టీలే బయటకొస్తాయన్నారు. కాంగ్రెస్ వివరాలు బయటకొచ్చినా తమకేం ఇబ్బంది లేదని అన్నారు. పిల్ వేసిన వారికి అభినందించాలని అన్నారు. ప్రజాస్వామ్యం బతికుంది కనుక ఇలాంటి తీర్పు వచ్చిందని షర్మిల అన్నారు.

ఇవి కూడా చదవండి

AP Politics: ముద్రగడ, హరిరామ జోగయ్యపై పవన్ షాకింగ్ కామెంట్స్..

AP Politics: నేడు ఢిల్లీకి పవన్, చంద్రబాబు.. బీజేపీ అగ్రనేతలతో భేటీ..

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 07 , 2024 | 06:37 PM

Advertising
Advertising