ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Weather: హమ్మయ్య.. రైతులూ ఇక టెన్షన్ అక్కర్లేదు..!

ABN, Publish Date - Apr 12 , 2024 | 07:22 AM

రైతాంగానికి చల్లని కబురు... గతేడాది వాతావరణ శాఖ అంచనా వేసిన దానికంటే ఏడు రోజులు ఆలస్యంగా భారత్‌లోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు ఈ సారి నిర్ణీత తేదీకంటే ముందుగానే రానున్నాయి. ప్రపంచంలో అనేక దేశాల వాతావరణంపై తీవ్ర ప్రభావం చూపిన సూపర్‌ ఎల్‌నినో క్షీణత వేగంగా సాగుతుండడంతో.. వచ్చేనెల నాటికి తటస్థ పరిస్థితులు, జూన్‌కల్లా లానినా దశ ప్రారంభమవుతుందని అంతర్జాతీయ వాతావరణ సంస్థలుఅంచనా వేస్తున్నాయి.

ఈ ఏడాది ముందే రానున్న నైరుతి రుతుపవనాలు

క్షీణిస్తున్న ఎల్‌నినో.. జూన్‌కల్లా లానినా పరిస్థితులు..

అనుకూలంగా పాజిటివ్‌ ఇండియన్‌ ఓషన్‌ డైపోల్‌

మంచి వర్షాలు కురుస్తాయని నిపుణుల అంచనా..

‘నైరుతి’పై త్వరలోనే ఐఎండీ తొలి అంచనా విడుదల

విశాఖపట్నం, ఏప్రిల్‌ 11 (ఆంధ్రజ్యోతి): రైతాంగానికి చల్లని కబురు... గతేడాది వాతావరణ శాఖ(IMD) అంచనా వేసిన దానికంటే ఏడు రోజులు ఆలస్యంగా భారత్‌లోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు(Monsoon) ఈ సారి నిర్ణీత తేదీకంటే ముందుగానే రానున్నాయి. ప్రపంచంలో అనేక దేశాల వాతావరణంపై తీవ్ర ప్రభావం చూపిన సూపర్‌ ఎల్‌నినో క్షీణత వేగంగా సాగుతుండడంతో.. వచ్చేనెల నాటికి తటస్థ పరిస్థితులు, జూన్‌కల్లా లానినా దశ ప్రారంభమవుతుందని అంతర్జాతీయ వాతావరణ సంస్థలుఅంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారతదేశ వ్యవసాయ రంగానికి మేలు చేసే నైరుతి రుతుపవనాలు నిర్ణీత తేదీకంటే ముందే కేరళలో ప్రవేశించే అవకాశాలున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం పసిఫిక్‌, హిందూ మహాసముద్రాలలోని వాతావరణ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే నైరుతి రుతుపవనాలు ముందుగానే ప్రవేశిస్తాయని, మంచి వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు. పసిఫిక్‌ మహాసముద్రంలో లానినా, హిందూ మహాసముద్రంలో ఇండియన్‌ ఓషన్‌ డైపోల్‌ (ఐవోడీ) పాజిటివ్‌గా మారనుండడం నైరుతి రుతుపవనాలకు అనుకూలమని పేర్కొంటున్నారు. దీంతో దేశంలో అనేక ప్రాంతాల్లో మంచి వర్షాలు కురుస్తాయని వివరించారు. ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదవుతుందని ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్‌ రెండు రోజుల క్రితం వెల్లడించిన విషయం తెలిసిందే. నైరుతి రాక, వర్షాల తీరుపై భారత వాతావరణ శాఖ (ఐఎండీ) త్వరలో తొలి అంచనా నివేదిక విడుదల చేయనుంది.

దానికంటే ముందుగానే కొందరు నిపుణుల సానుకూల విశ్లేషణ వేసవి తీవ్రతతో అల్లాడుతున్న ప్రజలకు ఉపశమనంగా పేర్కొనవచ్చు. సాధారణంగా నైరుతి రుతుపవనాలపై పసిఫిక్‌, హిందూ మహాసముద్రాల్లో నెలకొనే వాతావరణం తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం మధ్య, తూర్పు పసిఫిక్‌ మహాసముద్రంలో సాధారణం కంటే ఎక్కువగా ఉన్న ఉపరితల ఉష్ణోగ్రతలు క్రమేపీ చల్లబడుతున్నాయి. వచ్చే నెలకు వేడి మరింత తగ్గి జూన్‌కల్లా చల్లబడతాయి. దీంతో పసిఫిక్‌ మహాసముద్రంలో లా నినా ఏర్పడుతుంది. అదే సమయంలో రానున్న రెండు నెలల్లో హిందూ మహాసముద్రంలో ఐవోడీ పాజిటివ్‌గా మారుతుందని పలు మోడల్స్‌ అంచనా వేస్తున్నాయి. ఈ రెండింటి ప్రభావంతో జూలై నుంచి సెప్టెంబరు మధ్యకాలంలో విస్తారంగా వర్షాలు కురిసేందుకు అనువైన వాతావరణం ఏర్పడనుంది.

ఈ సమయంలో వరుసగా బంగాళాఖాతంలో అల్పపీడనాలు, వాయుగుండాలు ఏర్పడి మధ్య, వాయవ్య భారతం వైపు పయనిస్తాయి. దీంతో ఇటు బంగాళాఖాతం అటు అరేబియా సముద్రం నుంచి తేమ రావడంతో పశ్చిమ తీరం, దానికి ఆనుకుని వాయువ్య భారతం ఇంకా కోర్‌ మాన్‌సూన్‌ ఏరియా (మధ్యభారతం పరిసరాలు)లో ఎక్కువ వర్షాలు కురుస్తాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. కాగా గతేడాది ఎల్‌నినో ప్రభావం వలర నైరుతి రుతుపవనాలు నిరాశపరచాయి. దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. దీంతో వ్యవసాయ దిగుబడులు తగ్గాయి. తాగునీటికి కటకటలాడాల్సిన పరిస్థితి నెలకొంది. ఎల్‌నినో ప్రభావంతో వాతావరణం వేడెక్కడంతో దేశంలో అనేక ప్రాంతాలు ఉడుకుతున్నాయి. మరోవైపు వడగాడ్పులు కొనసాగుతున్నాయి. జూన్‌ వరకు గాడ్పులు, ఎండలు కొనసాగుతాయన్న ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో నిర్ణీత సమయం కంటే ముందే నైరుతి రుతుపవనాల వస్తాయని నిపుణులు అంచనా వేయడం చల్లని కబురే.!

కాస్త తగ్గిన వడగాలి

రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు, వడగాల్పులు కాస్త తగ్గాయి. గురువారం నంద్యాల జిల్లా నందవరంలో 42.6 డిగ్రీలు, కడప జిల్లా చక్రాయపాలెంలో 42.5, ప్రకాశం జిల్లా దరిమడుగులో 41.6, ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నంలో 41.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 20 మండలాల్లో వడగాల్పులు, శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలంలో తీవ్ర వడగాల్పులు వీచాయి. శుక్రవారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లోని 62 మండలాల్లో వడగాల్పులు వీస్తాయని, అల్లూరి జిల్లా చింతూరు మండలంలో తీవ్ర వడగాల్పులు ఉంటాయని విపత్తుల నిర్వహణసంస్థ తెలిపింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Apr 12 , 2024 | 07:33 AM

Advertising
Advertising