AP News: బరిలో నిలిచి.. గెలిస్తే..!
ABN, Publish Date - Mar 29 , 2024 | 04:34 PM
కడప లోక్‌సభ టీడీపీ అభ్యర్థిగా చడిపిరాళ్ల భూపేష్ రెడ్డి పేరును ఆ పార్టీ శుక్రవారం ప్రకటించింది. అంటే.. కూటమి అభ్యర్థిగా భూపేష్ రెడ్డి పేరు ఖరారైంది.
కడప లోక్‌సభ టీడీపీ అభ్యర్థిగా చడిపిరాళ్ల భూపేష్ రెడ్డి (chappidiralla bhupesh reddy) పేరును ఆ పార్టీ శుక్రవారం ప్రకటించింది. అంటే.. కూటమి అభ్యర్థిగా భూపేష్ రెడ్డి పేరు ఖరారైంది. అయితే ఇప్పటి వరకు కడప ఎంపీ అభ్యర్థిగా వైయస్ వివేకా కుమార్తె సునీత నర్రెడ్డి (sunitha) లేదా ఆమె తల్లి వైయస్ సౌభాగ్యమ్మ (ys sowbhagyamma) పేరు పరిశీలనలో ఉన్నట్లు ఓ ప్రచారం అయితే రాజకీయ వర్గాల్లో గట్టిగానే జరిగింది. ఓ వేళ వీళ్లిద్దరిలో ఒకరు ఎన్నికల బరిలో దిగితే.. వారికి మద్దతుగా కూటమి అభ్యర్థి నిలబెట్టే అవకాశం లేదనే ఓ ప్రచారం కూడా సైతం బాగానే నడిచింది.
కానీ తాజాగా కూటమి అభ్యర్థిగా భూపేష్ రెడ్డి ప్రకటనతో.. వివేకా ఫ్యామిలీ నుంచి ఎవరో ఒకరు బరిలో దిగే అవకాశం ఉందా? లేదా? ఓ వేళ ఉంటే వారిద్దరలో ఎవరోఒకరు.. ఏ పార్టీ నుంచి అంటే.. కాంగ్రెస్ పార్టీ నుంచా లేకుంటే స్వతంత్ర్య అభ్యర్థిగా బరిలో దినున్నారా? అనే సందేహం అయితే సదరు రాజకీయ వర్గాల్లో ఓ చర్చ అయితే హల్‌చల్ చేస్తోంది.
Janasena: జగన్ జమానాలో అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా ఏపీ.. నాదెండ్ల మనోహర్..
ఎందుకంటే వైయస్ వివేకా హత్య (YS Viveka murder case) జరిగి ఈ ఏడాది మార్చి 15వ తేదీకి అయిదేళ్లు పూర్తి చేసుకోంది. మరోవైపు మేము సిద్దం అంటూ ఫ్యాన్ పార్టీ అధినేత, సీఎం వైయస్ జగన్ బస్సు యాత్ర చేపట్టారు. అందులోభాగంగా తన సొంత చిన్నాన్న వైయస్ వివేకా హత్యపై ప్రొద్దుటూరు సభలో తొలిసారిగా వైయస్ జగన్ స్పందించారు. ఈ హత్య చేసింది ఎవరో తనకు, ఆ భగవంతుడికి తెలుసన్నారు. అలాగే తన సోదరిమణులిద్దరు అతడి వెనుకే ఉన్నారంటూ కీలక వ్యాఖ్యలు సైతం ఆయన చేశారు.
మరోవైపు.. తన తండ్రి హత్య కేసులో సీఎం, సోదరుడు వైయస్ జగన్ వ్యవహరిస్తున్న నిర్లక్ష్య వైఖరిపై సునీత నర్రెడ్డి తాజాగా మీడియా ముందుకు వచ్చి తీవ్రంగా స్పందించారు. అలాంటి వేళ వైయస్ వివేకా ప్యామిలీ ఈ ఎన్నికల బరిలో దిగుతుందా? లేదా? అనే ఓ సందేహం అయితే సర్వత్ర వ్యక్తమవుతోంది. ఇంకోవైపు ఏపీ పీసీసీ చీఫ్ వైయస్ షర్మిల పులివెందుల నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగనున్నారనే ఓ ప్రచారం సైతం సాగుతుండగా.. కడప ఎంపీ స్థానం నుంచి వైయస్ షర్మిల పోటీ చేయనున్నారని.. అందుకోసం ఆమెపై పార్టీ అధిష్టానం తీవ్ర ఒత్తిడి తీసుకు వస్తుందనే ఓ ప్రచారం కూడా నడుస్తోంది.
ఇక కడప లోక్‌సభ స్థానానికి ఫ్యాన్ పార్టీ అభ్యర్థిగా వైయస్ అవినాష్ రెడ్డి పేరుని ఇప్పటికే సీఎం వైయస్ జగన్ ప్రకటించారు. అయితే ఇదే అవినాష్ రెడ్డితోపాటు ఆయన తండ్రి వైయస్ భాస్కరరెడ్డిల పేర్లు వైయస్ వివేకా హత్యకేసులో ప్రమేయం ఉందంటూ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అలాంటి సమయంలో వైయస్ అవినాష్ రెడ్డి ప్రత్యర్థిగా కడప లోక్‌సభ స్థానం నుంచి సునీత నర్రెడ్డి లేదా ఆమె తల్లి వైయస్ సౌభాగ్యమ్మ బరిలో దిగితే మాత్రం.. ప్రపంచంలోని తెలుగు ప్రజల దృష్టంతా ఆ నియోజకవర్గంపైనే ఉంటుందని ఓ చర్చ అయితే సదరు సర్కిల్‌లో నడుస్తోంది.
అదీకాక.. ఈ ఎన్నికల్లో సునీత నర్రెడ్డి విజయం సాధిస్తే మాత్రం.. వైయస్ వివేకా హత్య కేసులో.. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే మాత్రం ప్రజాస్వామ్య పద్దతిలో ప్రజలు ధర్మం వైపే నిలిచి ఉన్నారని సుస్పష్టమవుతోందనే ఓ ప్రచారం కూడా వాడి వేడిగా వైరల్ అవుతోంది. అలా కాకుండా ఈ ఎన్నికలు.. అవి ఇవి మనకు వద్దు.. తన తండ్రి హత్య కేసులో తమకు న్యాయం జరిగితే చాలనుకొంటే మాత్రం ఆ బాధిత కుటుంబానికి అంటే సునీత నర్రెడ్డి ఫ్యామిలీకి న్యాయం జరగడం మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందనే ఓ చర్చ సైతం సదరు సర్కిల్‌లో హల్‌చల్ చేస్తోంది.
టీడీపీ ఆవిర్భావ వేడుకల్లో భువనేశ్వరి
మరిన్నీ ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Mar 29 , 2024 | 08:29 PM