Minister Rammohan Naidu: వరద బాధితులకు అండగా ఉంటాం.. రామ్మోహన్ నాయుడు కీలక వ్యాఖ్యలు
ABN, Publish Date - Sep 06 , 2024 | 07:08 PM
భోగాపురం ఎయిర్‌పోర్టు పనులను ప్రతీ నెలా పరిశీలిస్తామని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌కు అత్యంత ప్రాధ్యాన ఇస్తోందని వివరించారు.
విజయనగరం: భోగాపురం ఎయిర్‌పోర్టు పనులను ప్రతీ నెలా పరిశీలిస్తామని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌కు అత్యంత ప్రాధ్యాన ఇస్తోందని వివరించారు. 2026, జూన్ కల్లా భోగాపురం ఎయిర్‌పోర్టు పూర్తి చేసే లక్ష్యంతో పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. ఈరోజు(శుక్రవారం) విజయనగరం జిల్లాలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పర్యటించారు.
ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ... భోగాపురం ఎయిర్‌పోర్టు పనులు ఇప్పటి వరకు 40 శాతం పూర్తయ్యాయని చెప్పారు. ఏపీలో భారీ వర్షాలతో ఇబ్బందులు ఎదురైనా...పట్టుదలతో నిర్మాణ పనులు జరుగుతున్నాయని చెప్పారు. ఉత్తరాంధ్రలో వలసలు అరికట్టేందుకు ఈ ప్రాజెక్ట్ మంచి అవకాశమని అన్నారు. భూములిచ్చిన రైతులందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు శాయశక్తులా కష్టపడుతున్నామని అన్నారు.కానీ, బాధ్యతతో ఉండాల్సిన ప్రతిపక్ష నాయకుడు జగన్ రాజకీయం చేస్తున్నారని విమర్శలు చేశారు. అసత్య ప్రచారంతో విషయాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు.కూటమి ప్రభుత్వం వచ్చి మూడు నెలలు కూడా కాలేదు..ఇంత పెద్ద విపత్తు వచ్చిందని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు.
Updated Date - Sep 06 , 2024 | 07:11 PM