ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Elections: బరితెగించిన వైసీపీ నేతలు.. సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాలు!

ABN, Publish Date - Apr 11 , 2024 | 07:16 AM

ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్‌లో సోషల్ మీడియా వేదికగా ఫేక్ ప్రచారాలకు అంతు లేకుండా పోయింది. ఫేక్ ప్రచారంలో అధికార వైసీపీ ముందువరుసలో ఉన్నట్లు తెలుస్తోంది. ఏదో విధంగా అసత్య ప్రచారాలతో ప్రజల మైండ్‌సెట్ మార్చాలనే ప్రయత్నంలో భాగంగా ఫేక్ పబ్లిసిటీకి వైసీపీ సోషల్ మీడియా విభాగం శ్రీకారం చుట్టిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్‌లో సోషల్ మీడియా వేదికగా ఫేక్ ప్రచారాలకు అంతు లేకుండా పోయింది. ఫేక్ ప్రచారంలో అధికార వైసీపీ (YSRCP) ముందువరుసలో ఉన్నట్లు తెలుస్తోంది. ఏదో విధంగా అసత్య ప్రచారాలతో ప్రజల మైండ్‌సెట్ మార్చాలనే ప్రయత్నంలో భాగంగా ఫేక్ పబ్లిసిటీకి వైసీపీ సోషల్ మీడియా విభాగం శ్రీకారం చుట్టిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు ప్రతిపక్ష పార్టీల నాయకులను టార్గెట్ చేస్తూ.. మాట్లాడని అంశాలను మాట్లాడినట్లు.. గతంలో ఎప్పుడో మాట్లాడిన ప్రసంగాల్లోని వ్యాఖ్యలను కట్ చేసి ఎన్నికల ప్రచారంలో మాట్లాడినట్లు ట్రోల్స్ చేయడం ఇటీవల కాలంలో ఎక్కువుగా చూస్తున్నాం. విపక్షాలను నేరుగా ఎదుర్కోలేక, వారిపై నిందలు వేయడమే లక్ష్యంగా ఈ ప్రచారం సాగుతోంది. గతంలో పెన్షన్ల పంపిణీ విషయంలోనూ వైసీపీ సోషల్ మీడియా విభాగం అసత్య ప్రచారం చేస్తూ.. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిందనే చర్చ జరిగింది. వైసీపీకి ఓటు వేయకపోతే ఇంటింటికి పెన్షన్ రాదంటూ ఫేక్ ప్రచారం చేశారు. ప్రభుత్వ సిబ్బందితోనే పెన్షన్లు పంపిణీ చేయాలని ఎన్నికల సంఘం ఆదేశిస్తే.. దీనికి విపక్షాలే కారణమంటూ ప్రచారం చేశాయి. మరోవైపు వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎన్నికల ప్రచార సమయంలో చెప్పినా.. ఎన్డీయే కూటమి వస్తే వాలంటీర్లను తీసేస్తారంటూ అసత్య ప్రచారానికి తెరలేపారు. వీటన్నింటికి పెద్దగా స్పందన రాకపోగా.. వైసీపీ కుయుక్తులను ప్రజలు అర్థం చేసుకున్నట్లు తెలుస్తోంది. చివరికి ఇంటెలిజెన్స్ బ్యూరోను వైసీపీ నేతలు వదలలేదు. ఓ ఫేక్ సర్వేను తయారుచేసి.. కేంద్ర నిఘా విభాగం వెల్లడించిన నివేదిక అంటూ సోషల్ మీడియాలో వైరల్ చేసింది. ఈ సర్వేతో తమకు సంబంధం లేదని ఇంటెలిజెన్స్ బ్యూరో ప్రకటించడంతో ఇది వైసీపీ డైరెక్షన్‌లో తయారైన ఫేక్ సర్వేగా తేలింది.


AP Elections: వైసీపీ మరో నాటకం.. ఇంటెలిజెన్స్ బ్యూరో పేరిట ఫేక్ సర్వే.

ఫేక్ ప్రచారం ఎందుకు..?

ఏపీలో వైసీపీ ప్రభుత్వంపై ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారనే సంకేతాలు వెలువడుతున్నాయి. క్షేత్రస్థాయిలో ఏ ఒక్క ఓటరును అడిగినా జగన్ ప్రభుత్వంపై సంతృప్తి వ్యక్తం చేయడంలేదు. అభివృద్ధి విషయంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని ఏపీ ప్రజలు చెబుతున్నారు. దీంతో తమ గెలుపు కష్టమని భావించిన వైసీపీ నేతలు.. తప్పుడు ప్రచారాలతో ప్రజలను ఏమార్చే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. మొదట విపక్షాలపై నిందలు వేసే ప్రయత్నం చేసి విఫలమవ్వడంతో.. ఇక వైసీపీనే గెలుస్తుందంటూ ఫేక్ సర్వేలతో ప్రజల మైండ్‌సెట్ మార్చేందుకు ఆ పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారు. ఎన్నికలకు మరో నెల రోజుల సమయం ఉంది. ఈలోపు ఇంకెన్ని ఫేక్ పబ్లిసిటీలకు, కుట్రలకు వైసీపీ తెరలేపుతుందో వేచి చూడాల్సి ఉంది.

చేరికల జోరు.. ప్రచార హోరు

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Apr 11 , 2024 | 12:02 PM

Advertising
Advertising