Duvvada Srinivas: దువ్వాడ.. దివ్వెల సంచలన నిర్ణయం.. అప్పటివరకూ కలిసే ఉంటాం..
ABN, Publish Date - Oct 07 , 2024 | 07:43 PM
తిరుమలలో తాము వివాహం చేసుకున్నట్లు వస్తున్న వార్తలను వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఆయన ప్రియురాలు దివ్వెల మాధురి ఖండించారు. తాము వివాహం చేసుకోలేదని, కొంత మంది పని గట్టుకుని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని దువ్వాడ శ్రీనివాస్ మండిపడ్డారు.
శ్రీకాకుళం: తిరుమలలో తాము వివాహం చేసుకున్నట్లు వస్తున్న వార్తలను వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఆయన ప్రియురాలు దివ్వెల మాధురి ఖండించారు. తాము వివాహం చేసుకోలేదని, కొంత మంది పని గట్టుకుని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని దువ్వాడ శ్రీనివాస్ మండిపడ్డారు. తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంగా ఇవాళ(సోమవారం) ఉదయం తిరుమలకు వెళ్లామని, ఆ ఫొటోలను పెట్టి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. తనకు, తన భార్య దువ్వాడ వాణికి సంబంధించిన అంశాలు ఇంకా కోర్టులోనే ఉన్నాయని, కోర్టు తీర్పు అనంతరం పెళ్లిపై నిర్ణయం ప్రకటిస్తానని శ్రీనివాస్ చెప్పారు.
దువ్వెల మాధురి సంబంధించి కూడా ఆమె భర్తతో కేసు నడుస్తోందని, అది ఓ కొలిక్కి వచ్చాక పెళ్లి గురించి ప్రకటిస్తామని చెప్పారు. తాము గతంలోనూ తిరుమలకు వచ్చామని, ఇవాళ కూడా దర్శనం కోసమే వచ్చినట్లు దువ్వెల మాధురి తెలిపారు. ఇద్దరికి విడాకులు వచ్చిన తర్వాత వివాహం చేసుకుంటామని ఆమె తేల్చి చెప్పారు. అప్పటి వరకూ ఇద్దరం కలిసే జీవిస్తామని స్పష్టం చేశారు. అయితే తమ పెళ్లి జరిగిపోయిందంటూ వచ్చే ప్రచారాలను నమ్మెుద్దని మాధురి కోరారు.
శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం వైసీపీ మాజీ ఇన్‌ఛార్జ్, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ విభేదాల అనంతరం చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చారు. తన ప్రియురాలు మాధురితో కలిసి ఇవాళ ఉదయం తిరుమలకు వచ్చారు. వారిద్దరూ తిరుమల కొండపై మీడియాకు ఫోజులిచ్చారు. కొన్ని రోజులుగా తన భార్యతో వివాదం కారణంగా దువ్వాడ శ్రీనివాస్ సైలెంట్ అయిపోయారు. దివ్వెల మాధురితో ఆయన సన్నిహితంగా ఉండడం, ఆస్తి వివాదాలతో వారి కుటుంబం వివాదం రోడ్డెక్కిన సంగతి తెలిసిందే.
సుమారు నెల రోజుల తర్వాత మళ్లీ తన ప్రియురాలు మాధురితో కలిసి తిరుమల కొండపై దువ్వాడ కనిపించారు. ఉదయం బ్రేక్ దర్శనం సమయంలో మాధురితో కలిసి శ్రీవారిని ఆయన దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు మీడియాకు ఫోజులిచ్చారు. అయితే ఆ ఫొటోలను సోషల్ మీడియాలో తిప్పుతూ తాము పెళ్లి చేసుకున్నట్లు తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారంటూ వారిద్దరూ మీడియా ముందుకు వచ్చారు. పెళ్లి వార్తలను ఖండించారు. తమ పెళ్లిపై స్పష్టమైన ప్రకటన చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Minister Satya Kumar: కేంద్రానికి మంత్రి సత్యకుమార్ లేఖ.. ఏపీలో ఆ ప్రాజెక్టు చేపట్టాలంటూ వినతి..
Delhi Tour: ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ.. కీలక అంశాలపై చర్చ..
Updated Date - Oct 07 , 2024 | 08:03 PM