ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Inter Results: క్షణికావేశానికి నిండు ప్రాణం బలి.. ఇంటర్ లో ఫెయిల్.. మనస్తాపంతో..

ABN, Publish Date - Apr 12 , 2024 | 05:01 PM

పల్నాడు జిల్లాలో విషాదం నెలకొంది. ఇంటర్ ( Inter ) రీక్షల్లో ఫెయిల్ అయ్యాననే మనస్తాపంతో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. నరసరావుపేట మండలం ఇక్కురు గ్రామానికి చెందిన అర్చన ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతోంది.

పల్నాడు జిల్లాలో విషాదం నెలకొంది. ఇంటర్ ( Inter ) రీక్షల్లో ఫెయిల్ అయ్యాననే మనస్తాపంతో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. నరసరావుపేట మండలం ఇక్కురు గ్రామానికి చెందిన అర్చన ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతోంది. మార్చిలో జరిగిన పరీక్షలకు ఆమె హాజరయ్యారు. ఈ క్రమంలో ఇవాళ ఇంటర్ ఫలితాలు వెల్లడయ్యాయి. ఫలితాల్లో అర్చన ఫెయిల్ అయింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై ఎవరూ లేని సమయంలో ఇంట్లో ఉరేసుకుని సూసైడ్ చేసుకుంది. సూసైడ్ లెటర్ రాసి అఘాయిత్యానికి పాల్పడింది.


పరీక్షల్లో ఫెయిల్ అయ్యాననే కారణంతో సూసైడ్ చేసుకోవడం తీవ్ర ఆవేదనకు గురి చేస్తోంది. పరీక్షలు ఏవైనా సరే.. ఫెయిల్ అయితే తట్టుకోలేకపోతున్నారు. ఇంట్లో వాళ్లు తిడతారనో పొరుగువారు ఏమనుకుంటారనో తీవ్ర మనో వేదనకు గురువుతున్నారు. తమ ఇబ్బందిని ఎవరికి చెప్పుకోవాలో తెలియక నిండు ప్రాణాలు తీసుకుంటున్నారు. పరీక్షల్లో ఫెయిల్ అయితే మళ్లీ రాసి పాస్ అవ్వొచ్చు అనే ధైర్యాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు గుర్తించాలి. పిల్లలకు అనుక్షణం సలహాలు, సూచనలు అందిస్తూ మార్గదర్శకంగా ఉండాలి.


AP Inter Results 2024: ఏపీ ఇంటర్‌ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ ఇక్కడ చూసేయండి..

కాగా.. ఏపీ ఇంటర్ పరీక్షా ఫలితాలు విడుదల అయ్యాయి. ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి సౌరబ్ గౌర్ ఫలితాలు విడుదల చేశారు. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలను కమిషనర్ ఒకే సమయంలో విడుదల చేశారు. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పరీక్షలకు మొత్తం 4,61,273 మంది విద్యార్థులు హాజరవగా.. 3,10,875 మంది విద్యార్థులు పాస్ అయ్యారు. సెకండ్ ఇయర్ పరీక్షలకు మొత్తం 3,93,757 మంది విద్యార్థులు హాజరవగా.. 3,06,528 మంది ఉత్తీర్ణత సాధించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.

Updated Date - Apr 12 , 2024 | 05:06 PM

Advertising
Advertising