Tirumala: తిరుమల ఈడీపీ ఆఫీస్‌లో సడెన్‌గా మంటలు.. డేటా తగులబెట్టేందుకు యత్నించారా?
ABN, Publish Date - Jun 29 , 2024 | 11:37 AM
వైకుంఠం ఎదురుగా వున్న ఈడీపీ ఆఫీస్‌లో మంటలు చెలరేగాయి. ఏసీ కంప్రెజర్ నుంచి మంటలు చెలరేగడంతో ఫైర్ అలారం మోగింది. దీంతో వెంటనే అప్రమత్తమైన సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చింది. గత కొద్ది రోజులుగా తిరుమల తిరుపతి దేవస్థానంలోని అవినీతి, అక్రమాలపై విజిలెన్స్ అధికారులు విచారణ జరుపుతున్నారు. ఈ క్రమంలోనే మంటలు చెలరేగడం పలు అనుమానాలకు తావిస్తోంది.
తిరుమల: వైకుంఠం ఎదురుగా వున్న ఈడీపీ ఆఫీస్‌లో మంటలు చెలరేగాయి. ఏసీ కంప్రెజర్ నుంచి మంటలు చెలరేగడంతో ఫైర్ అలారం మోగింది. దీంతో వెంటనే అప్రమత్తమైన సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చింది. గత కొద్ది రోజులుగా తిరుమల తిరుపతి దేవస్థానంలోని అవినీతి, అక్రమాలపై విజిలెన్స్ అధికారులు విచారణ జరుపుతున్నారు. ఈ క్రమంలోనే మంటలు చెలరేగడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈడీపీ ఆఫీస్‌లోని తిరుమలకు సంబంధించిన డేటాని తగలబెట్టేందుకు మంటలు పెట్టారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫైర్ అలారం మోగడంతో పెను ప్రమాదం తప్పింది.
సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందే తిరుమల ప్రక్షాళనకు చంద్రబాబు నడుం బిగించారు. టీటీడీ ఈవోగా జె శ్యామలరావుకు బాధ్యతలు అప్పగించారు. ఆయన ప్రతి నిత్యం ఏదో ఒక డిపార్ట్‌మెంటుతో సమావేశమవుతూ ఆ విభాగంలో లోటు పాట్లను తెలుసుకునేందుకు యత్నిస్తున్నారు. ఎప్పటికప్పుడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులు తమ విభాగ పరిస్థితిని ఈవోకు వివరిస్తున్నారు. ఈ క్రమంలోనే విజిలెన్స్ అధికారులను సైతం శ్యామలరావు అప్రమత్తం చేశారు. దీంతో తిరుమలలోని అవినీతి అక్రమాలపై విజిలెన్స్ విభాగానికి చెందిన అధికారులు ఫోకస్ పెట్టారు. ఇప్పుడు సడెన్‌గా ఈడీపీ కార్యాలయంలో మంటలు చెలరేగడం పలు అనుమానాలకు తావిస్తోంది.
Updated Date - Jun 29 , 2024 | 11:37 AM