ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Sujana Chowdary: ఎమ్మెల్యేగా గెలిచాక సుజనా చౌదరి ఫస్ట్ రియాక్షన్

ABN, Publish Date - Jun 20 , 2024 | 08:05 PM

అస్సలు గెలిచే ప్రసక్తే లేదు.. విజయవాడ పశ్చిమ కాకుండా వేరే ఏ నియోజకవర్గం అయినా బాగుండేది.. ఇక్కడ పోటీచేసి సుజనా చౌదరి అనవసరంగా ఓడిపోతారేమోనని కూటమి కార్యకర్తల్లో ఒకింత అనుమానం ఉండేది. సీన్ కట్ చేస్తే.. గెలుపే కాదు, ఊహించని మెజార్టీ దక్కించుకున్నారు..

అమరావతి: అస్సలు గెలిచే ప్రసక్తే లేదు.. విజయవాడ పశ్చిమ కాకుండా వేరే ఏ నియోజకవర్గం అయినా బాగుండేది.. ఇక్కడ పోటీచేసి సుజనా చౌదరి అనవసరంగా ఓడిపోతారేమోనని కూటమి కార్యకర్తల్లో ఒకింత అనుమానం ఉండేది. సీన్ కట్ చేస్తే.. గెలుపే కాదు, ఊహించని మెజార్టీ దక్కించుకున్నారు..! మంత్రి పదవి కూడా దక్కాల్సి ఉంది కానీ.. సామాజిక సమీకరణలు, పార్టీ రీత్యా రాలేదు. ఈ ఊహించని విజయంపై తొలిసారిగా సుజనా స్పందించారు.


గెలవడు అన్నారు కానీ..!

ఎన్నికలో ఇది నా మొదటి అనుభవం. విజయవాడ పశ్చిమ అనేది అతి కష్టమైన నియోజకవర్గం అని చెప్పారు. ఛాలెంజ్‌లకు పారిపోను ఎంత కష్టమైనా చేస్తానని చెప్పాను. సూర్యచంద్రులు ఉన్నంత వరకూ కుల, మతాలు ఉండవు. వెస్ట్ నియోజకవర్గంలో నన్ను కుటుంబ సభ్యుడిగా చేసుకోమని కోరాను.. చేసుకున్నారు. సుజనా గెలవడు అన్నారు.. వేరే నియోజకవర్గంలో గెలిచి ఉంటే సామాజిక వర్గం గెలిపించిందనే వాళ్ళు. జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్‌కు అవకాశం ఇవ్వాల్సింది అయినా నాకు వచ్చింది. ఆశావహులను, స్థానిక నేతలందర్నీ కలుపుకుంటూ 42 రోజులు ప్రజల్లో తిరిగాను. 45 ఏళ్లలో ఇదే మొదటిసారి గెలవడం. 47 వేల మెజార్టీతో గెలిచాం. ఇన్నాళ్లు అరాచక పాలనను చూశాం. గడిచిన ఐదేళ్లు ఒక కేస్ స్టడీ. ఆశావాహులు నిరాశపడకుండా పనిచేయాలి. కూటమిలో బేధాభిప్రాయాలు రాకుండా బీజేపీని పెంచుకుంటూ ముందుకు వెళ్లాలిఅని కార్యకర్తలు, నేతలకు సుజనా చౌదరి సూచించారు.

Updated Date - Jun 20 , 2024 | 08:14 PM

Advertising
Advertising