AP Schools: స్కూళ్లకు సెలవులు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
ABN, Publish Date - Apr 02 , 2024 | 11:37 AM
ఏపీలో ఎండలు మండుతున్నాయి. దీంతో ఏపీ ప్రభుత్వం స్కూళ్లకు వేసవి సెలవులు ప్రకటించేసింది. ఏప్రిల్ 24 నుంచి పాఠశాలలకు సెలవులు ప్రారంభం కానున్నాయి. జూన్ 13 వరకూ అంటే 50 రోజుల పాటు పాఠశాలలకు ప్రభుత్వం సెలవులను ప్రకటించింది.
అమరావతి: ఏపీలో ఎండలు మండుతున్నాయి. దీంతో ఏపీ ప్రభుత్వం (AP Government) స్కూళ్లకు వేసవి సెలవులు ప్రకటించేసింది. ఏప్రిల్ 24 నుంచి పాఠశాలలకు సెలవులు ప్రారంభం కానున్నాయి. జూన్ 13 వరకూ అంటే 50 రోజుల పాటు పాఠశాలలకు ప్రభుత్వం సెలవులను ప్రకటించింది. మార్చి 18 నుంచి ఏపీ ప్రభుత్వం ఎండల కారణంగా ఒంటిపూట బడులను ప్రకటించింది. అప్పటి నుంచి ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు ఒంటిపూట ఒడులు నిర్వహిస్తున్నారు. కాగా.. ఏపీ వ్యాప్తంగా ఏప్రిల్ 23 నాటికి అన్ని తరగతుల విద్యార్థులకు పరీక్షలు పూర్తి చేసి.. 24 నుంచి వేసవి సెలవులు ఇవ్వనున్నారు.
Chandrababu: జగన్ బతుకే ఒక ఫేక్ బతుకు.. నీచమైన తీరు వారి డీఎన్‌లోనే ఉంది..
మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
Updated Date - Apr 02 , 2024 | 11:44 AM