ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వివేకా హత్య కేసులో..ఎంపీ అవినాశ్‌రెడ్డికి సుప్రీం నోటీసులు

ABN, Publish Date - Nov 20 , 2024 | 03:43 AM

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో వైసీపీ ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, ఆయన కొడుకు చైతన్యరెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.

  • శివశంకర్‌రెడ్డి, ఆయన కొడుక్కి కూడా

  • చైతన్యరెడ్డి, రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రతివాదులుగా చేర్చిన ధర్మాసనం

  • తదుపరి విచారణ మార్చికి వాయిదా.. సునీత, రాజశేఖర్‌రెడ్డి, రాంసింగ్‌లపై ప్రైవేటు కేసులో ఎంవీ కృష్ణారెడ్డికి నోటీసులు

  • విచారణ ఫిబ్రవరి 24కి వాయిదా

న్యూఢిల్లీ, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో వైసీపీ ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, ఆయన కొడుకు చైతన్యరెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తన తండ్రి హత్య కేసులో నిందితులైన అవినాశ్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డికి ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ వివేకా కుమార్తె సునీతారెడ్డి గత నెల 14న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్‌పై మంగళవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ సంజయ్‌ కుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. సునీత తరఫున సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ్‌ లూథ్రా వాదనలు వినిపించారు. ఈ కేసులో అప్రూవర్‌గా మారిన వ్యక్తి(షేక్‌ దస్తగిరి)ని ఏ-5 శివశంకర్‌రెడ్డి (ఏ-5) కొడుకు చైతన్యరెడ్డి జైలుకు వెళ్లి బెదిరించారని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ప్రైవేటు వైద్యుడిగా ఉన్న చైతన్యరెడ్డి జైలుకు వెళ్లి సాక్షులను ప్రభావితం చేయడానికి ప్రయత్నించారని తెలిపారు. ఆయన రెగ్యులర్‌గా జైలుకు వెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించే వైద్యుడా అని ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించారు. కాదని.. జైలు నిబంధనలకు విరుద్ధంగా జైల్లోకి వెళ్లారని లూథ్రా బదులిచ్చారు. అవినాశ్‌రెడ్డి కీలక నిందితుల్లో ఒకరని, ఆయన బెయిల్‌పై ఉండడం వల్లే ఇటువంటివి జరుగుతున్నాయని తెలిపారు. ఈ కేసులో చైతన్యరెడ్డితోపాటు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ప్రతివాదులుగా చేర్చాలని కోరారు. లూథ్రా వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం.. చైతన్యరెడ్డిని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రతివాదులుగా చేర్చడానికి అంగీకరించి నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణను వచ్చే ఏడాది మార్చి 3వ తేదీ నుంచి ప్రారంభమయ్యే వారానికి వాయిదా వేసింది.


  • దర్యాప్తును అడ్డుకునేందుకే ప్రైవేటు ఫిర్యాదులు..

కాగా.. వివేకా మాజీ పీఏ ఎంవీ కృష్ణారెడ్డి ఈ హత్య కేసు దర్యాప్తు పురోగతిని అడ్డుకునేందుకే సునీతారెడ్డి, అల్లుడు రాజశేఖర్‌రెడ్డి, సీబీఐ అధికారి రాంసింగ్‌లపై ప్రైవేటు ఫిర్యాదులు చేశారని లూథ్రా ధర్మాసనానికి నివేదించారు. రాజకీయ దురుద్దేశాలతో కేసును పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారని తెలిపారు. తమపై పెట్టిన కేసులను కొట్టి వేయాలని(క్వాష్‌ చేయాలని) కోరుతూ ఈ ముగ్గురూ వేర్వేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ మూడు పిటిషన్లూ మంగళవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చాయి. దర్యాప్తు అధికారిపై ప్రైవేటు ఫిర్యాదు చేసి, తద్వారా విచారణను ప్రభావితం చేశారని లూథ్రా తెలిపారు. వాదనల అనంతరం.. కృష్ణారెడ్డికి ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 24వ తేదీకి వాయిదా వేసింది.

Updated Date - Nov 20 , 2024 | 06:14 AM