ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

YSRCP: నన్ను చంపేస్తారు.. వైసీపీ నేత సంచలన ఆరోపణలు..

ABN, Publish Date - Oct 11 , 2024 | 07:53 PM

జిల్లాలోని తాడిపత్రి నియోజకవర్గంలో రాజకీయం మరోసారి వేడెక్కింది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దా రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తనను చంపేందుకు ప్రయత్నిస్తున్నారని..

Tadipatri Ex MLA Kethireddy Peddareddy

అనంతపురం, అక్టోబర్ 11: జిల్లాలోని తాడిపత్రి నియోజకవర్గంలో రాజకీయం మరోసారి వేడెక్కింది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దా రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తనను చంపేందుకు ప్రయత్నిస్తున్నారని.. ఇందుకు పోలీసులు కూడా సహకరిస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలే ఇప్పుడు మరింత రచ్చ చేస్తున్నాయి. మరి పెద్దారెడ్డిని ఎవరు చంపాలని చూస్తున్నారు? అసలేం జరిగింది? పూర్తి వివరాలివే..


తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. తనను చంపేందుకు కుట్రలు చేస్తున్నారని అన్నారు. తనకు టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి నుంచి ప్రాణహానీ ఉందన్నారు. సాక్షాత్తూ ఎస్పీ జగదీష్ సహకారంతోనే జేసీ తనను చంపేందుకు కుట్రలు చేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు కేతిరెడ్డి.


ఎన్నికల పోలింగ్ నుంచి ఇప్పటి వరకు పలుమార్లు తనను చంపేందుకు జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రయత్నించారని పెద్దారెడ్డి ఆరోపించారు. తన అన్న కేతిరెడ్డి సూర్యప్రతాప్ రెడ్డిని 2006లో చంపారని.. ఇప్పుడు అదే పద్ధతిలో తనను హతమార్చేందుకు జేసీ కుట్రలు చేస్తున్నారని పెద్దారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. జేసీ గూండాలకు ఎస్పీ జగదీష్ సహాయ సహకారాలు అందజేస్తున్నారంటూ ఆరోపించారు. తనపై ఇప్పుడు మూడు హత్యాయత్నం కేసులు నమోదు చేశారన్నారు.


ఎన్నికల సమయంలో సిట్ విచారణ చేసిన ఘటనలపై మళ్లీ కేసులు ఎందుకు నమోదు చేశారో ఎస్పీ జగదీష్ సమాధానం చెప్పాలని పెద్దారెడ్డి డిమాండ్ చేశారు. జేసీ ఆదేశాలతోనే తనను తాడిపత్రికి వెళ్లడానికి ఎస్పీ అనుమతించడం లేదన్నారు. తనకు, తన కుటుంబ సభ్యులకు జేసీ ప్రభాకర్ రెడ్డి నుంచి ప్రాణహానీ ఉందన్నారు. ఎస్పీ అనుమతితో తాడిపత్రి వెళ్లినా.. తన ఇంటిపై దాడి జరిగిందన్నారు. అక్రమ కేసుల్లో తనను వేధిస్తున్నారని, ఎస్పీ జగదీష్ సహకారంతో తనను చంపేందుకు ప్రయత్నిస్తున్నారంటూ పెద్దారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.


Also Read:

ఒమర్‌కు మద్దతు లేఖను అదించిన కాంగ్రెస్

ఓరి మీ దుంపతెగ.. గర్ల్‌ఫ్రెండ్ కోసం ఎంతకు తెగించార్రా

త్వరపడండి.. స్కూటర్‌పై రూ.30 వేల వరకు తగ్గింపు

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Oct 11 , 2024 | 07:53 PM