AndhraPradesh - TCS: ఏపీకి గుడ్ న్యూస్.. ఇక వారికి ఢోకా లేదు..!
ABN, Publish Date - Oct 09 , 2024 | 08:16 PM
రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయింది. అలాంటి వేళ.. 2014లో జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం కొలువు తీరింది. దీంతో రాజధానిగా అమరావతి నిర్మాణం, ఆంధ్రుల జీవ నాడి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి సీఎం చంద్రబాబు చర్యలు చేపట్టారు.
అమరావతి, అక్టోబర్ 09: ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలను పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. అందులోభాగంగా సాగర తీర నగరం విశాఖపట్నంలో టాటా కన్సల్టెంట్ సర్వీస్ (టీసీఎస్) ఏర్పాటు చేసేందుకు సుముఖత వ్యక్తం చేసింది. ముంబయిలో టాటా సన్స్ చైర్మన్ ఎం. చంద్రశేఖరన్‌తో ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ బుధవారం భేటీ అయ్యారు.
Also Read: దుర్గాష్టమి.. అమ్మవారిని ఇలా పూజించండి..
ఈ సందర్బంగా గతంలో ఇచ్చిన మాట ప్రకారం విశాఖలో టీసీఎస్ ఏర్పాటు చేసేందుకు టాటా గ్రూప్‌ను నారా లోకేశ్ ఒప్పించారు. విశాఖలో టీసీఎస్ ఏర్పాటు చేయడం వల్ల .. 10 వేల మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. ఇక ఈవీ, ఎయిరో స్పేస్, స్టీల్, టూరిజం రంగాల్లో పెట్టుబడుల అవకాశాలూ సైతం పరిశీలిస్తామని టాటా గ్రూప్.. మంత్రి నారా లోకేశ్‌కు హామీ ఇచ్చింది.
Also Read: కేంద్రమంత్రికి సీఎం లేఖ.. ఆగిన వేలం
మరోవైపు ఇప్పటికే రాష్ట్రంలో లులూ, ఒబెరాయ్, బ్రూక్ ఫీల్డ్, సుజలాన్ సంస్థలు భారీగా పెట్టుబడులు పెట్టాయి. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీ గిఫ్ట్‌గా టీసీఎస్‌ను మంత్రి నారా లోకేశ్ తీసుకు వచ్చారు. దీంతో విశాఖపట్నం ఐటీ హబ్‌గా రూపాంతరం చెందనుంది. అలాగే ప్రఖ్యాత కంపెనీల పెట్టుబడులకు గమ్యస్థానంగా కూడా ఆంధ్రప్రదేశ్ రూపు రేఖలను సంతరించుకుంది.
Also Read: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ
రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయింది. అలాంటి వేళ.. 2014లో జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం కొలువు తీరింది. దీంతో రాజధానిగా అమరావతి నిర్మాణం, ఆంధ్రుల జీవ నాడి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి సీఎం చంద్రబాబు చర్యలు చేపట్టారు.
Also Read: వరుసగా బ్యాంకులకు సెలవులు
అంతలో 2019 ఎన్నికలు వచ్చేశాయి. ఈ ఎన్నికల్లో వైసీపీకి ఓటరు పట్టం కట్టారు. దీంతో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. దీంతో ప్రతిపక్షనేతగా గతంలో వైఎస్ జగన్.. అమరావతికి అసెంబ్లీ సాక్షిగా మద్దతు పలికారు. కానీ ఆయన ముఖ్యమంత్రి కాగానే.. మాట తప్పి.. మడం తిప్పేశారు. ఏపీకి మూడు రాజధానులు ఉండాలంటూ అదే అసెంబ్లీ సాక్షిగా నిర్ణయం తీసుకున్నారు.
Also Read: ఇలా చేస్తే మీ స్మార్ట్ ఫోన్ బ్యాటరీకి ఎక్కువ లైఫ్ ఉంటుంది.. అది ఎలాగంటే..?
దీంతో రాజధాని అమరావతికి భూములు ఇచ్చిన రైతులు ఆందోళన బాట పట్టారు. వారి ఆందోళనను సైతం అణిచివేసేందుకు సీఎం వైఎస్ జగన్ ఎన్ని ప్రయత్నాలుంటే అన్ని ప్రయత్నాలు చేశారు. ఇక పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం ఎంత వరకు వచ్చిందంటే.. చెప్పే నాథుడు సైతం కరువయ్యారు. అలాగే చంద్రబాబు ప్రభుత్వ హయాంలో వచ్చిన పరిశ్రమలు సైతం ఇతర రాష్ట్రాలకు తరలిపోయాయి.
Also Read: జీతం ఇచ్చేందుకు రెడీ.. మీరు సిద్దమా అని సవాల్
ఇలా సీఎం వైఎస్ జగన్ ప్రజా వ్యతిరేక పాలనపై అన్ని వర్గాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. ఇక 2024 ఎన్నికలు రానే వచ్చాయి. ఈ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి కూటమిగా ఎన్నికలకు వెళ్లాయి. ఈ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ఓటరు కూటమి పట్టం కట్టారు. దీంతో చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం కొలువు తీరింది.
Also Read: రసాయన శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ బహుమతి
చంద్రబాబు ప్రభుత్వం కొలువు తీరిన అనంతరం దాదాపు 100 రోజుల్లోనే ఏపీలో పరిశ్రమలు ఏర్పాటుకు పలు సంస్థలు ముందుకు వచ్చాయి. ఆ క్రమంలో ఇటీవల లులూ గ్రూప్ సైతం విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిలో పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించింది. తాజాగా టాటా సంస్థ సైతం ఏపీలో టీసీఎస్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
For AndhraPradesh News And Telugu News...
Updated Date - Oct 09 , 2024 | 08:37 PM