ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP Govt : రాష్ట్రాన్ని వల్లకాడు చేయడమే జగన్‌ విజన్‌!

ABN, Publish Date - Dec 17 , 2024 | 05:23 AM

రాష్ట్రాన్ని వల్లకాడుగా చేయడం ఒక్కటే మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డికి తెలిసిన విజన్‌ అని తెలుగుదేశం పార్టీ ఎద్దేవా చేసింది. ‘రాజధానిని స్మశానంగా మార్చారు.

  • సర్వ నాశనానికి ఆయనే బ్రాండ్‌ అంబాసిడర్‌: టీడీపీ

అమరావతి, డిసెంబరు 16(ఆంధ్రజ్యోతి): రాష్ట్రాన్ని వల్లకాడుగా చేయడం ఒక్కటే మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డికి తెలిసిన విజన్‌ అని తెలుగుదేశం పార్టీ ఎద్దేవా చేసింది. ‘రాజధానిని స్మశానంగా మార్చారు. రాష్ట్రం నుంచి పరిశ్రమలను వెళ్లగొట్టారు. ఇసుక నుంచి మద్యం వరకూ దేనినీ వదిలిపెట్టకుండా జగన్‌ దోచుకొని రాష్ట్రాన్ని పీల్చి పిప్పి చేశారు. పనులు లేక భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్య చేసుకొనే పరిస్థితి వచ్చి, రాష్ట్రం వల్లకాడు మాదిరిగా మిగిలింది. సర్వ నాశనానికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉన్న జగన్‌ కూడా తమ పార్టీ వాళ్లతో... తన మీడియాతో విజన్‌ డాక్యుమెంట్‌ మీద విమర్శలు చేయించడం వింతల్లోకెల్లా వింత’ అని విమర్శించింది. టీడీపీ అధికార ప్రతినిధి, రాష్ట్ర బయో డైవర్సిటీ సంస్థ చైర్మన్‌ నీలాయపాలెం విజయ్‌ కుమార్‌ సోమవారం తమ పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.

‘చంద్రబాబు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి కోసం విజన్‌ 2020 డాక్యుమెంట్‌ తయారు చేయించి విడుదల చేస్తే అప్పటి ప్రతిపక్షం నవ్వింది. కానీ, ఆ విజన్‌ వల్లే రాష్ట్రానికి ఐటీ కంపెనీలు తరలివచ్చి వాటిలో 34 లక్షల ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చాయి. సైబరాబాద్‌ పేరుతో ఒక కొత్త నగరం రూపుదిద్దుకొంది. హైదరాబాద్‌ నగరం నుంచి లభిస్తున్న ఆదాయం మొత్తం తెలంగాణ రాష్ట్రానికి ఆర్థికంగా వెన్నెముకగా మారింది. ఆ నాటి విజన్‌ డాక్యుమెంట్‌ వల్ల వచ్చిన ఫలితం అది. విభజిత ఆంధ్రప్రదేశ్‌ను కూడా 1947నాటికి అభివృద్ధిలో అత్యుత్తమ స్థాయికి తీసుకువెళ్లడానికి మళ్లీ ఇప్పుడు విజన్‌ డాక్యుమెంట్‌ను టీడీపీ ప్రభుత్వం తయారు చేయించింది. అయిన కాడికి దోచుకొనే ఆర్థిక నేరగాళ్లకు విజన్‌ అంటే తెలియదు. అందుకే దానిని తిట్టిపోస్తున్నారు’ అని నీలాయపాలెం విమర్శించారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కాక ముందు 50 ఏళ్లలో రాష్ట్రంలో విద్యుత్‌ ఉత్పత్తి కేవలం ఐదు వేల మెగావాట్లు ఉంటే, ఆయన సీఎం అయిన తర్వాత పది వేల మెగావాట్లు పెంచారని, విజన్‌ అంటే అలాగే ఉంటుందని వ్యాఖ్యానించారు.

Updated Date - Dec 17 , 2024 | 05:24 AM